Begin typing your search above and press return to search.
దొంగకి ఊరందరూ దొంగలుగానే కనపడతారు: కేశినేని నాని
By: Tupaki Desk | 17 July 2019 7:47 AM GMTవిజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని చంద్రబాబు అంటే తనకు ఏమాత్రం లెక్క లేదని మరోసారి ప్రూవ్ చేశారు. టిడిపికే చెందిన ఎమ్మెల్సీ బుద్ద వెంకన్నతో గత ఐదారు రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగిస్తున్న ట్వీట్ల యుద్ధాన్ని నాని ఆపలేదు. ఈ ఇద్దరు నేతలు పరిధిలు అతిక్రమించి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకోవడంతో పార్టీ పరువు కాస్తా బజారున పడింది. చివరకు ఈ ట్వీట్ల యుద్ధం చివరకు లోకేష్, చంద్రబాబు దృష్టికి చేరడంతో వీటికి పుల్‌స్టాఫ్ పెట్టాలని అధిష్టానం సూచించింది.
అధిష్టానంపై గౌరవంతో తాను ఈ సోషల్ వార్‌కు పుల్ స్టాప్ పెట్టేస్తున్నానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రకటించారు. అయితే నాని మాత్రం దీనిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నాని వెంకన్నపై పరోక్షంగా గుళ్లో కొబ్బరి చిప్పల దొంగ... సైకిల్ బెల్లుల దొంగ అని విమర్శిస్తే... అందుకు ప్రతిగా వెంకన్న మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులు కొట్టేసినోడు అని నానిని టార్గెట్ చేశారు. ఇక తాజాగా నాని మరోసారి వెంకన్నపై విరుచుకుపడ్డారు.
‘‘ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా.. 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి ఊరందరూ దొంగలుగానే కనపడతారు’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు. నాని ఈ ట్వీట్ చేయడం వెనక ఈ నెల 14న బుద్ధా చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గానే అని స్పష్టమవుతోంది.
ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారంటూ బుద్దా వెంకన్న ఈ నెల 14న ట్వీట్ చేశారు. అధిష్టానం సూచనల మేరకు వెంకన్న ట్వీట్లు ఆపేసినా... నాని మాత్రం అప్పటి ట్వీట్లకు కౌంటర్లుగా తన ట్వీట్లు మాత్రం ఆపలేదు. ఈ వివాదానికి ఎప్పటకి ఫుల్‌స్టాప్ పడుతుందో ? నాని చంద్రబాబు మాటనే లెక్కచేయడం వెనక ఆయన రాజకీయ ఎజెండా ? ఏంటో చూడాలి.