Begin typing your search above and press return to search.

శ్రీ‌శ్రీ మాట‌ల‌తో బాబుకు షాకిచ్చిన నాని!

By:  Tupaki Desk   |   7 Jun 2019 4:26 AM GMT
శ్రీ‌శ్రీ మాట‌ల‌తో బాబుకు షాకిచ్చిన నాని!
X
త‌మ్ముళ్ల అసంతృప్తిని చ‌ల్లార్చే విష‌యంలో బాబు ఫెయిల్ అవుతున్నారా? దారుణ ప‌రాజ‌యం నేప‌థ్యంలో త‌మ్ముళ్ల‌ను కంట్రోల్ చేసే విష‌యంలో బాబుకు స్టామినా సరిపోవ‌ట్లేదా? బాబు చేత‌కానిత‌నాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు మొహ‌మాట‌ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌న్న ధోర‌ణికి కేశినేని నాని లాంటోళ్లు ఎందుకు డిసైడ్ అవుతున్నారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

అధినేత తీరు మీద అసంతృప్తితో ఉన్న విజ‌య‌వాడ ఎంపీ.. టీడీపీ సీనియ‌ర్ నేత కేశినేని నాని ఇటీవ‌ల ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆయ‌న పెట్టిన పోస్ట్ తో బాబు నుంచి పిలుపు అందుకున్న ఆయ‌న‌.. గంట‌పాటు భేటీ అయ్యారు.

పార్టీ ఇచ్చిన ప‌ద‌విని వ‌ద్ద‌న్న నానిని సముదాయించే ప్ర‌య‌త్నం బాబు చేసినా.. నాని మాత్రం తానేం అనుకున్నానో దాన్నే ఫాలో అయ్యేందుకు డిసైడ్ అయ్యారు. నాని అల‌క‌కు కార‌ణాలు బోలెడ‌న్ని ఉండ‌టం.. ఆయ‌న బీజేపీలోకి వెళ్లిపోనున్నార‌న్న ప్ర‌చారం లాంటివి ఆయ‌న్ను మ‌రింత హ‌ర్ట్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. అధినేత క్లాస్ త‌ర్వాత కూడా ఆయ‌న త‌న తీరును మార్చుకోక‌పోవ‌ట‌మే కాదు.. తాజాగా ఫేస్ బుక్ లో చేసిన మ‌రో పోస్ట్ సంచ‌ల‌నంగా మారింది. విప్ల‌వ క‌వి శ్రీ‌శ్రీ ప‌దాల్ని ఉటంకిస్తూ ఆయ‌న పెట్టిన పోస్ట్ ప‌ర‌మార్థం ఏమిట‌న్న దానిపై పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

ఓట‌మితో తీవ్రమైన షాక్ తో ఉన్న పార్టీని మ‌రింత ఇరుకున పెట్టేలా కేశినేని నాని పోస్ట్ ఉంద‌న్న మాట ప‌లువురి నోట వ‌స్తోంది. ఇలాంటివి మంచివి కావ‌న్న మాట వినిపిస్తోంది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు త‌ప్ప అంటూ శ్రీ‌శ్రీ కోట్ చేసిన ప‌వ‌ర్ ఫుల్ మాట‌ను నాని పోస్ట్ గా మార‌టం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. నాని పెట్టిన పోస్ట్ తో ఆయ‌న పార్టీనుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు సైతం మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. నానిపెట్టిన తాజా పోస్ట్ లో ఆయ‌న ఫ్యూచ‌ర్ ప్లాన్ ను చెప్పేశార‌న్న ప్ర‌చారం సాగుతోంది.

అయితే.. నాని పార్టీ మారేందుకుసిద్ధంగా లేర‌ని.. పార్టీలో కోట‌రీల అంతు చూసేందుకే నాని తెగించి మ‌రీ ఇలాంటి పోస్టులు పెడుతున్న తీరు మంచిది కాద‌ని.. లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ క‌లుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నాని బీజేపీలోకి వెళ‌తారా? లేదా? అన్న దానిపై క్లారిటీ కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.