Begin typing your search above and press return to search.
కలకలంగా కేశినేని ట్వీట్!
By: Tupaki Desk | 13 July 2019 5:13 AM GMTఎంత పెద్ద మనసు. పాపం.. ఆ పెద్ద మనిషి తన భూభాగం.. తన భూభాగం నుంచి నీళ్లను ఏపీకి ఇచ్చేందుకు ముందుకొస్తే.. ఇలా మాట్లాడతారా? కేసీఆర్ ది ఎంత పెద్దమనషు.. ఎంత ఔదార్యం.. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అదే పనిగా పొగిడేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు ఎంత సంచలనంగా మారాయన్నది తెలిసిందే.
తెలంగాణ గోదావరి నీళ్లను శ్రీశైలం డ్యామ్ లోకి చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్న వేళ.. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు.. విమర్శలు వ్యక్తమవుతున్న జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేసీఆర్ ది ఎంత ఔదార్యం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో ట్వీట్లతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న ఆయన.. మరోసారి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. మీరు చెప్పింది అక్షరాల నిజం జగన్ గారూ.. కేసీఆర్ గారికి అంత ఔదార్యం ఉండబట్టే కదా ఎన్నికల్లో మీకు అంత సాయం చేసిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పలు విధాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి జగన్ కు సాయం అందిందని.. ఈ కారణంగానే ఆయన విజయం సులువైందన్న ఆరోపణ ఎంతో కాలంగా వినిపిస్తున్నదే. అదే విషయాన్నివ్యంగ్య వ్యాఖ్యతో చెప్పటం ద్వారా కేశినేని తాను చెప్పాల్సిన విషయాన్నిచెప్పేశారు. ఎన్నికల్లో చేసిన సాయానికి ప్రతిఫలంగా కేసీఆర్ ను ఇంతలా పొగిడేయటం.. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు పాజిటివ్ గా రియాక్ట్ కావటం లాంటివి చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం కేశినేని నాని వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు.