Begin typing your search above and press return to search.
మండలి రద్దు..అమిత్ షా హామీతోనే?
By: Tupaki Desk | 27 Jan 2020 1:39 PM GMTఆంధ్రప్రదేశ్ శాసనమండలి విషయంలో ఊహించిందే. మండలి రద్దుకు నిర్ణయించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు కేబినెట్ ఆమోదం - శాసనమండలిలో చర్చ అనంతరం ఆమోదించుకోవడంతో నెగ్గించుకున్నారు. అయితే, ఈ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా మండలిలో ఎక్కువమంది సభ్యులు ఉన్న టీడీపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. మరోవైపు - సీపీఐ సైతం జగన్ తీరును ఖండించింది.
టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో జగన్ పై సెటైర్లు వేశారు. ``జగన్ అన్నా @ysjagan నీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది 28 మంది ఎమ్మెల్సీ ల దెబ్బకు భయపడి పారిపోవటానికి కాదు దమ్ముగా పోరాడతావని . ఇంత పిరికివాడివి అనుకోలేదు.`` అంటూ ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన సీనియర్ నేత - వంగవీటి రాధా మీడియాతో మాట్లాడుతూ - ముఖ్యమంత్రి జగన్ రివర్స్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాజధానినే రివర్స్ చేశారని వ్యాఖ్యానించారు. తాజాగా తన తండ్రి వైఎస్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఉపసంహరించుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీని కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళితే ప్రజలు కూడా రివర్స్ ఓటు వేసి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాగా, సీపీఐ నేత నారాయణ మండలి రద్దుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ - కౌన్సిల్ వ్యవస్థకు తమ పార్టీ వ్యతిరేకమని తెలిపారు. అయితే, ఆత్రంగా సీఎం జగన్ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో బలం ఉందని ఏకపక్షంగా రద్దు చేస్తున్నారని...ఇది సరైంది కాదని నారాయణ అన్నారు. శాసన మండలి రద్దుకు తీర్మానం చేసినా సంవత్సరం కాలం పట్టవచ్చన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీతోనే కౌన్సిల్ రద్దు విషయంలో జగన్ ముందుకు వెళ్లరని అనుకుంటున్నామని నారాయణ కొత్త డౌట్లు పుట్టించారు.