Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కంటే చిరునే బ‌ల‌వంతుడట‌!

By:  Tupaki Desk   |   20 Aug 2018 6:11 AM GMT
ప‌వ‌న్ కంటే చిరునే బ‌ల‌వంతుడట‌!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాటి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే చిరంజీవి చాలా బ‌ల‌వంతుడ‌ని... ఆయ‌న‌తో పోలిస్తే.. ప‌వ‌న్ బ‌ల‌హీనుడ‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెల్చుకోలేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అదే స‌మ‌యంలో ప్ర‌జారాజ్యంపై కొన్ని వ్యాఖ్య‌లు చేసిన నాని.. ప‌వ‌న్ లోని లోపాల్ని బ‌య‌ట‌పెట్టారు. ప‌వ‌న్ ను వదులుకోవాల‌ని బాబు అనుకోలేద‌న్న ఆయ‌న‌.. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ను మిత్ర‌ప‌క్షంగా చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏమిటో చెప్పుకొచ్చారు. ఒక ఛాన‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పారు నాని. ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+ ప‌వ‌న్ కంటే చిరంజీవి వంద‌రెట్లు శ‌క్తివంతుడు. ఆయ‌న చాలా సున్నిత‌మైన మనిషి. వేలెత్తి చూపించ‌లేని వ్య‌క్తిత్వం. చిరంజీవిని.. ప‌వ‌న్ ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వ్య‌క్తిగా ఈ మాట‌ల్ని చెబుతున్నా.

+ ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ‌.

+ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఒక్క సీటు కూడా రాదు. ప‌వ‌న్ కు స్థిర‌త్వం.. ప‌రిణితి లేదు. ప్ర‌జారాజ్యం పార్టీని చాలా ద‌గ్గ‌ర నుంచి చూసిన వ్య‌క్తిగా ఈ విష‌యాల్ని చెబుతున్నారు. ఇప్ప‌టికి కూడా ప‌వ‌న్ కంటే కూడా చిరంజీవే వంద రెట్లు బ‌ల‌వంతుడు.

+ చిరంజీవి వ్య‌క్తిత్వం చాలా సున్నిత‌మైన‌ది. ఆయ‌న చాలా మృదు స్వ‌భావి. ఎలాంటి వివాదాలు లేని వ్య‌క్తి. ప్ర‌జారాజ్యం చిరంజీవి.. ప‌వ‌న్ క‌ల్యాణ్.. అల్లు అర‌వింద్‌.. నాగ‌బాబు అంద‌రూ క‌లిసి ఏర్పాటు చేసిన వ్య‌వ‌స్థ‌. అలాంటి చిరుకే 18 సీట్లు వ‌చ్చాయి.

+ తాను స్వ‌యంగా బ‌రిలోకి దిగిన స్థానంలోనూ చిరంజీవి ఓడిపోయారు. ప‌వ‌న్ పార్టీకి ఒక్క సీటు రాదు. ఆయ‌న కూడా ఓడిపోవ‌టం ఖాయం.

+ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ చావుబ‌తుకుల స‌మ‌స్య.. అందుకే ఏఒక్క ఓటు వ‌దులుకోని ప‌రిస్థితి లేదు. అందుకే ఆ రోజున మాతో క‌లిసి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రిని క‌లుపుకు వెళ్లాం.

+ ప‌వ‌న్ ను వదులుకోవాల‌ని చంద్ర‌బాబు అస్స‌లు అనుకోలేదు. ప‌వ‌న్ లేవ‌నెత్తిన అన్ని స‌మ‌స్య‌ల్ని బాబు ప‌రిష్క‌రించారు. ఒక మిత్ర‌ప‌క్షంగా జ‌న‌సేనాని చెప్పిన వాటిని చంద్ర‌బాబు చేశారు. అలాంటిది ఇప్పుడు హ‌టాత్తుగా యూట‌ర్న్ తీసుకొని సీఎం బాబును.. మంత్రి లోకేశ్ ను ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నారు.

+ మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మిగిలిన ఎంపీల మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఆ త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయారు. బీజేపీతో ఆయ‌న కుమ్మ‌క్కు అయ్యారా? స‌్థిర‌త్వం.. ప‌రిణితి లేక‌పోవ‌టం వ‌ల్లే ప‌వ‌న్ చెప్పిన మాట మీద నిల‌బ‌కుండా ఉంటున్నారు.