Begin typing your search above and press return to search.
ఛీ.. ఛీ.. తమ్ముళ్ల కైమా మాటలేంది బాబు?
By: Tupaki Desk | 27 Oct 2018 10:00 AM GMTబాధ్యత అన్నది ఏ మాత్రం లేనట్లుగా.. బరి తెగించేసి మాట్లాడటం అలవాటుగా మారింది తెలుగు తమ్ముళ్లకు. జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన కత్తి దాడి నేపథ్యంలో బాబుతో సహా ఆయన పరివారం వ్యవహరించిన తీరు పార్టీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన పరిస్థితి.
జగన్ పై దాడి ఎపిసోడ్ లో ఏపీ అధికార.. విపక్షాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధాన్ని అంతకంతకూ దిగజారిపోయేలా తెలుగు తమ్ముళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. వారి మాటలు ఉండటం గమనార్హం.
తాజాగా జగన్ పై జరిగిన హత్యాయత్నంపై టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు విన్న వారికి.. ఇదేం పద్ధతి అన్న చిరాకుతో పాటు.. ఇలా కూడా మాట్లాడతారా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్ జగన్ ఎప్పుడో కైమా.. కైమా అయిపోయేవారంటూ వికృత వ్యాఖ్యలు చేయటం షాకింగ్ గా మారింది. ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ ఎప్పుడో అయిపోయేవారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పై దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎంతమాత్రం కాదన్నారు.
విపక్ష నేతపై జరిగిన దాడి నేపథ్యంలో మాటల్ని ఆచితూచి అన్నట్లుగా మాట్లాడాల్సిన అధికార పక్షం.. పూర్తిగా బరితెగించినట్లుగా చేస్తున్న మొరటు వ్యాఖ్యలు టీడీపీకి భారీ నష్టాన్ని చేయటం ఖాయమంటున్నారు. ఎవరి మీదనైనా దాడి జరిగినప్పుడు ఆగ్రహంతో బాధితులు ఒక మాట మాట్లాడటం సహజం కానీ.. అందుకు భిన్నంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్న అధికారపక్ష నేతలు తమ బాధ్యతను వదిలేయటం సరికాదు.
కైమా.. కైమా.. దుర్మార్గంగా మాట్లాడటం ఏ మాత్రం సబబు కాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. జగన్ పై జరిగిన కత్తి దాడి ఎపిసోడ్‌లో ఇప్పటికే తాను.. తన కుమారుడు చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న బాబు.. తన తమ్ముళ్లను హెచ్చరిస్తే మంచిది. లేకుంటే.. మరింత నష్టపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.