Begin typing your search above and press return to search.
మన స్థాయి కాని ఇష్యూలో ట్వీట్లు అవసరమా నాని?
By: Tupaki Desk | 7 Aug 2019 4:31 AM GMTనేతగా రాణించాలంటే ఏం చేయాలి? ఏదేదో మాట్లాడే బదులు వారి మూడ్ కు తగ్గట్లు వ్యవహరిస్తే సరిపోతుంది. ఇంత చిన్న విషయం విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎందుకు తెలీటం లేదన్నది ఒక పట్టాన అర్థం కాదు. జనాల మూడ్ తో తనకు సంబంధం లేదన్నట్లుగా.. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరుకు తగ్గట్లే.. చేతిలో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని నాని వారు ఎప్పటికి అర్థం చేసుకుంటారో?
తాజాగా అయ్యగారి కశ్మీర్ ఎపిసోడ్ మీద ట్వీట్ చూస్తే.. నాని లెక్క తేడా కొట్టకమానదు. ఆర్టికల్ 370లో మార్పులు.. కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. విచిత్రంగా వ్యతిరేకించిన పార్టీల్లో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ అధికారం (కనీసం రాష్ట్రాల్లో అయినా)లో లేనివే కావటం గమనార్హం. ప్రజల అభిమానాన్ని మిస్ చేసుకున్న పార్టీలు.. ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా ఇప్పటికే తమదైన మూర్ఖత్వంతో వ్యవహరించే ధోరణి ఇదే తీరులో కొనసాగితే.. వారికెప్పటికి అధికారం చేతికి రాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
సుదీర్ఘకాలంలో జమ్ముకశ్మీర్ అంశం రాచపుండులా మారి తెగ ఇబ్బంది పెట్టేస్తున్న వేళ.. దానికి కాయకల్ప చికిత్స దమ్ము.. ధైర్యం దేశంలోని ఏ రాజకీయ అధినేతకు లేని వేళ.. అందుకు భిన్నంగా దూసుకెళుతున్న మోడీ తీరుతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇందుకు భిన్నంగా బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యల్ని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒక పక్క తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ అధినేత కశ్మీర్ ఎపిసోడ్ లో మోడీ చర్యకు మద్దతు ఇచ్చిన వేళ.. పార్టీ స్టాండ్ కు భిన్నంగా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఆ రోజు ఆంధ్రా ప్రజల గొంతు నొక్కారని.. ఈ రోజు కశ్మీర్ ప్రజల గొంతు నొక్కినట్లుగా మండిపడ్డారు. ఫరూక్ అబ్దుల్లా.. మొహబూబా.. అజాద్.. ఒమర్ అబ్దుల్లా లాంటి వారు తమ వాదనను వినిపించటానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కేశినేని నాని వ్యక్తం చేశారు. ఏపీ విభజన వేళ.. నోరు మూసుకొని తన ఆర్థిక వ్యవహారాలు.. వ్యాపార ప్రయోజనాలు చూసుకోవటంలో తెగ బిజీగా ఉన్న నాని లాంటోళ్లు మాట్లాడటం చూస్తే ఒళ్లు మండక మానదు. అయినా.. కశ్మీర్ కు.. ఏపీ విభజనకు ఎక్కడ పోలిక ఉందని?
నిజానికి ఏపీ విభజన విషయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతల అత్యుత్సాహం.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు.. తమకు మించిన మొనగాళ్లు లేరన్న భావనే విభజన జరిగేలా చేసిందన్న వాస్తవాన్ని నాని ఇప్పటికి గుర్తించకపోవటం దేనికి నిదర్శనం? ఏపీ హోదా విషయంలో రోజుకో మాట మాట్లాడి.. స్థిరంగా స్టాండ్ వినిపించని నాని లాంటోళ్లు కశ్మీర్ లాంటి అంశాల్ని టచ్ చేయాల్సిన అవసరం ఉందంటారా?
పీవీపీ.. ఇతర నేతలపైన సోషల్ మీడియాతో పంచ్ లు వేసుకోకుండా..తనకు మించిన అంశాల్ని టచ్ చేయటం అర్థం లేని పని. చూస్తుంటే తాను బీజేపీలో చేరతానని జరుగుతున్న ప్రచారానికి చెక్ చెప్పేందుకు తాజా ట్వీట్ తో నాని పడిన ప్రయాస పక్కదారి పట్టినట్లే. కశ్శీర్ పై కేశినేని వారు పెట్టిన ట్వీట్ తో ఇప్పటివరకూ ఆయన్ను అభిమానించిన వారంతా.. ఇలాంటి నేతనా తాము అభిమనించిందన్న భావనకు గురి కావటం ఖాయం.కశ్మీర్ విషయంలో దేశప్రజల మూడ్ ను పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని కేశినేని నాని వారు ఎప్పటికి గుర్తిస్తారో?