Begin typing your search above and press return to search.
జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేసిన వైసీపీ
By: Tupaki Desk | 15 Jun 2019 6:35 AM GMTఏపీలో ఎన్నికల వేడి ముగిసినా ఆ పాతకక్షల వేడి మాత్రం చల్లారడం లేదు. అనంతపురం జిల్లాను ఏలిన జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు చెక్ చెప్పే పనిలో వైసీపీ బిజీగా ఉంది. వారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో చేసిన అక్రమాలకు చెక్ పెట్టే దిశగా వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది.
టీడీపీ హయాంలో అనంతపురం రాజకీయాలను ఏలిన జేసీ బ్రదర్స్.. ఇప్పుడు వైసీపీ గెలవడంతో సైలెంట్ అయ్యారు. జేసీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా గెలవకపోవడంతో వారి అరాచకాలపై ఇక వైసీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు.
తాజాగా జేసీ బ్రదర్స్ పై వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు. తాను తలుచుకుంటే జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో ఉండలేరని.. ప్రజలు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అదంతా తమ ప్రభుత్వ చలువేనని పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
జేసీ ఇప్పటికీ టీడీపీ హయాంలో పెట్టిన మట్కా, పేకాట ఇప్పటికీ ఆడిస్తూ వారితో డబ్బులు వసూలు చేయిస్తున్నాడని కేతిరెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో మట్కా లేకుండా చేస్తానని కేతిరెడ్డి స్పష్టం చేశారు. తాను తలుచుకుంటే ఒక గంట కూడా జేసీ ఫ్యామిలీ తాడిపత్రిలో తిరగలేరని స్పష్టం చేశారు. నేను అయ్యో పాపం అని టీడీపీ తాజా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు వదిలేయబట్టే ఇంకా ఉన్నారని.. మా వైసీపీ నాయకులను సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.