Begin typing your search above and press return to search.

దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ట్విస్ట్ .. !

By:  Tupaki Desk   |   21 Oct 2020 5:00 PM GMT
దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ట్విస్ట్ .. !
X
2017లో సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం బీఎస్‌-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిస్తే , దీని ప్రకారం 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాలు మాత్రమే విక్రయించాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కిన జేసీ బ్రదర్స్ అనంతపురం జిల్లాలో నిషేధిత వాహనాలను తెచ్చి వాటిని మార్చి విక్రయించారని తెలిసిందే. బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్‌-4గా మార్పుచేసి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాదు 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ కేసులో విచారణ జరిగే కొద్ది కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై కర్ణాటక లోకాయుక్తను ఆశ్రయించారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌ రెడ్డి ఫోర్జరీలపై లోకాయుక్తకు ఆధారాలు సమర్పించారు. జేసీకి సహకరించిన కర్ణాటక రవాణా శాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు చేశారు. కర్ణాటక డీజీపీ, పలువురు మంత్రులకు వీరిపై ఫిర్యాదు చేశారు. కాగా, 2017లో బీఎస్-3 వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే దివాకర్‌ ట్రావెల్స్‌ నిషేధిత వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేయించింది. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన 33 బస్సులు, లారీలను కర్ణాటకలో నడుపుతోంది. 2017లో సుప్రీంకోర్టు నిషేధించిన బిఎస్ -3 వాహనాలను బిఎస్ -4 వాహనాలుగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారని ఆధారాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమర్పించాడు.