Begin typing your search above and press return to search.

హ‌త్యారాజకీయాల‌కు కేరాఫ్ బాబు

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:19 PM GMT
హ‌త్యారాజకీయాల‌కు కేరాఫ్ బాబు
X
హత్యారాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే - వైఎస్‌ ఆర్‌ సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయమైందని - పంచభూతాలను పంచుకుతింటున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌కు నేడు అముల చేస్తున్న పాలన‌కు పొంత‌నే లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ఎన్నికల‌ స‌మ‌యంలో అధికారం కోసం బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన నేతలు నాలుగేళ్లలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిప‌డ్డారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందడం లేదని తెలిపారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా యాత్ర‌లో అడుగుకో బాధ‌..ఇంటికో వ్య‌థ వినిపిస్తోందని ఆయ‌న తెలిపారు. ఎవ‌రిని ప‌ల‌క‌రించిన చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌ని వాపోతున్నారని కేతిరెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో అడుగడుగునా సమస్యలు వెలుగు చూస్తున్నాయని, అందుకే వారందరికీ భరోసానిచ్చి నవరత్నాలను మీకు అందిస్తానని వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారని చెప్పారు. ప్రజలు దిద్దే మేనిఫెస్టోతో సమస్యలన్నీ తీరుస్తానని చెబుతున్నారని వివ‌రించారు.

రాష్ట్రంలో టీడీపీ నేతలు విఫరీతంగా ప్రజలను దోచుకుతింటున్నారని కేతిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజలు ఎక్కడా కూడా సంతోషంగా లేరని - గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదన్నారు. పేదవారు - వికలాంగులు అని చూడకుండా వైఎస్‌ ఆర్‌ సీపీ సానుభూతి పరులు అంటూ సంక్షేమ పథకాలు ఇవ్వడం అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఇడ్లీ అమ్ముకునే వారిని కూడా వదలడం లేదని విమర్శించారు. జననేత ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని కేతిరెడ్డి తెలిపారు. భవిష్యత్ వైఎస్‌ ఆర్‌ సీపీదే అని - వైఎస్‌ జగన్‌ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేతిరెడ్డి పేర్కొన్నారు.