Begin typing your search above and press return to search.

అమరావతి భారీ భూభాగోతంలో కీలక ఆరోపణలు ఇవే

By:  Tupaki Desk   |   11 May 2022 3:28 AM GMT
అమరావతి భారీ భూభాగోతంలో కీలక ఆరోపణలు ఇవే
X
దాదాపుగా మూడేళ్లుగా అమరావతిలో భారీ భూభాగోతం చోటు చేసుకున్నట్లుగా ఏపీ అధికార పక్ష నేతలు తరచూ ఆరోపించటం తెలిసిందే. ఇందులో చంద్రబాబు..ఆయనకు అత్యంత సన్నిహితుడు నారాయణతో పాటు మరికొందరు భారీ లబ్థి పొందినట్లుగా రాజకీయ ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కోవటం తెలిసిందే.

2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎర్పటానికి ముందు కూడా వైసీపీ నేతలు ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే. మొత్తానికి ఈ ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఫిర్యాదుపై సీడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

దీనికి సంబంధించి సీఆర్ డీఏ ఫైళ్లు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్టరేషన్ల వివరాలు.. ఇతర కీలక ఆధారాలను సేకరించినట్లుగాచెబుతున్నారు. ఈ భారీ భూభాగోతంలో చంద్రబాబు.. నారాయణలతో సహా మొత్తం పద్నాలుగు మంది మీద ఆరోఫనలు ఉన్నాయి.

సీఐడీ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. రహస్యంగా సాగిన సీఐడీ దర్యాప్తునకు సంబంధించి బయటకు వచ్చినట్లుగా చెబుతున్న వివరాలు ఏమంటే..

1. చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కు చెందిన 'సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ' ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ప్రతిపాదిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ను ముందుగానే చేర్చింది.

2. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ఎలా ఉంటుందన్నది అప్పటికే డిసైడ్ అయినా.. దాన్ని రహస్యంగా ఉంచారు.

3. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు నియమించిన ఎస్టీయూపీ అనే మరో కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలనే షరతు పెట్టారు.

4. సీఆర్ డీఏ ఛైర్మన్ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాటి మంత్రి నారాయణ పలు సమీక్షలు చేసినట్లుగా డ్రామాలు ఆడి.. ముందుగా ఖరారుచేసిన ఇన్నర్ నింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్ ను ఆమోదించారు.

5. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం.

6. మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను సీఐడీ అధికారుల పరిశీలనలో ఈ విషయాలు బయటకు వచ్చాయి.

7. అమరావతి ప్రాంతంలోనే రాజధాని వస్తుందని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు, ఆయన సన్నిహితులు, బినామీలు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు.

8. రాజధాని అమరావతి 122 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుందని 2014 డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌లో పేర్కొని.. 2015 జూన్‌ 9న 217 చదరపు కి.మీ.లకు.. ఆ తర్వాత 391 చదరపు కి.మీ.లకు పెంచటం కుట్రలో భాగమే.

9. చంద్రబాబు.. నారాయణ.. లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములన్నీ కూడా అమరావతి పరిధిలోనే ఉంటూ భూసమీకరణ పరిధిలోకి రాకపోవడానికి ఇదే కారణం. దీంతో.. ఎకరా సగటున రూ.25లక్షలకు కొనుగోలు చేసిన భూముల విలువ అమాంతంగా ఎకరా రూ.4కోట్ల వరకు చేరింది.