Begin typing your search above and press return to search.
సెకెండ్ వేవ్ ఎండ్‌పై కీలక ప్రకటన .. ఏంటంటే ?
By: Tupaki Desk | 3 Jun 2021 1:38 PM GMTమనదేశాన్ని కరోనా వైరస్ సెకండ్ వేవ్ వణికిపోయేలా చేస్తోంది. గత రెండు నెలలుగా ఉన్న కరోనా విజృంభణ తో పోల్చితే కొంచెం తగ్గినప్పటికి కూడా ,తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం షాకింగ్ అంశాలను వెల్లడించింది. కరోనా సెకెండ్ వేవ్ కొన్ని రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టినా ,దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో జూలై నుంచి సెప్టెంబర్ దాకా కొనసాగే ప్రమాదం వుందని వెల్లడించింది. ఈ ఎనిమిది రాష్ట్రాలలో ఏపీ కూడా వుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ఏపీలో ప్రతీ రోజూ పది వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీ రాజధానిలోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ చాన్స్‌లర్ డి.నారాయణ రావు పేరిట ఓ అధ్యయనం వెలువడింది.
అందులోని అంశాలు కొంచెం షాక్ ఇచ్చేలా వున్నాయి. నారాయణ రావు సారథ్యంలోని బృందం సస్పెక్టబుల్, ఇన్ఫెక్టెడ్, రికవరీ మోడల్ సాయంతో ర్యాండమ్ ఫారెస్టు మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ విధానంలో వైరస్ వ్యాప్తి, వేగం, తీవ్రతతోపాటు రికవరీలను అంఛనా వేశారు. ఏపీతోపాటు ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నమోదవుతున్న రోజూవారీ కేసులను పరిశీలించారు. ఈ బృందం అంఛనా వేసిన తేదీకి కాస్త అటు ఇటుగా ఢిల్లీ, యూపీల్లో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కర్నాటకలో జులై ఒకటో తేదీనాటికి కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని ప్రొ. నారాయణ రావు టీమ్ చెబుతోంది. మహారాష్ట్రలో జులై 13 నాటికి, ఏపీలో జులై 16వ తేదీ నాటికి సెకెండ్ వేవ్ తగ్గుతుందని ఈ బృందం అంఛనా వేసింది. తమిళనాడులో జులై 26 నాటికి, కేరళలో ఆగస్టు 12 నాటికి, బెంగాల్‌లో సెప్టెంబర్ 2వ తేదీ నాటికి కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో భారీ జనాలతో ఉత్సవాలు, కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సెకెండ్ వేవ్ మరి కొంత కాలం కొనసాగినా ఆశ్చర్యపోనక్కర లేదని నారాయణ రావు టీమ్ అంటోంది.