Begin typing your search above and press return to search.
నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యాలేంటి?
By: Tupaki Desk | 6 Sep 2022 5:07 AM GMTగడిచిన కొద్ది నెలలుగా కేంద్రం మీదా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మీద అదే పనిగా విరుచుకుపడుతున్న కేసీఆర్.. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ తో పాటు పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించటం తెలిసిందే.
ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ సర్కారు మీద నిప్పులు చెరిగారు.కాకుంటే.. ఇంతకు ముందు మాటలకు.. తాజాగా చేసిన ప్రసంగానికి తేడా ఏమంటే.. ఈసారి ప్రసంగంలో జాతీయ రాజకీయాల్లో తాను ఏం చేయాలనుకుంటున్న విషయాన్ని తొలిసారి స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పాలి.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనను కొంతకాలంగా చెబుతున్నప్పటికీ..తాజాగా సభలో మాత్రం ఆ విషయాన్ని ఖరారు చేసినట్లుగా చెప్పటంతో పాటు.. ఏ ఎజెండాతో ముందుకకు వెళ్లాలన్న దానిపైనా క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. తాను జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానంటూ ఆయన విస్పష్ట ప్రకటన చేశారని చెప్పాలి.
ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చెబితే.. "జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్నా. నిజామాబాద్ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా. ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుంది.
కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం" అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఇకపై తాను దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రకటించిన ఆయన.. బీజేపీ ముక్త్ భారత్ సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలకం కావాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోని మతతత్వ బీజేపీ సర్కారుపై ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధమన్న ఆయన.. మోడీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి.. ముఖ్యమైనవి.. అండర్ లైన్ చేసుకోవాల్సినవి చూస్తే..
కీలక వ్యాఖ్యలివే
- కేంద్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో విఫలమైంది. గడిచిన ఎనిమిదేళ్లలో మోదీ సర్కారు ఒక్క భారీ నీటి ప్రాజెక్టు కట్టలేదు. పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదు.
- గత ఎనిమిదేళ్లలో నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్‌కు అమ్మేస్తున్నారు. ఇప్పటిదాకా రూ.12 లక్షల కోట్లను దోచిపెట్టారు.
- రైతుల భూములనూ అమ్మేందుకు కుట్ర చేస్తున్నారు. అందుకే.. బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమైన వ్యాఖ్యలు ఇవే
- వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర జెండా ఎగరబోతోంది. ఢిల్లీ గడ్డ మీద మన ప్రభుత్వమే రాబోతోంది. నిజామాబాద్ గడ్డ నుంచి దేశ రైతులకు తీపి కబురు అందిస్తున్నా. 2024లో బీజేపీ లేని ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అప్పుడు తెలంగాణ మాదిరి దేశమంతటా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం.
- దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేవలం రూ.1.48 లక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.అయినా, ప్రధాని మోదీ వెనకడుగు వేస్తున్నారు. రైతుల బోర్లకు కాదని.. మోడీకి.. కేంద్రానికే మీటర్లు పెట్టాలి.
- తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా బీడు భూములకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తున్నాం. కానీ, బీజేపీ దేశవ్యాప్తంగా మత పిచ్చి మంటలు రేపుతోంది. కాల్వలో నీళ్లు పారించే ప్రభుత్వం కావాలా? మత రక్తాన్ని పాలించే ప్రభుత్వం కావాలో? తేల్చుకోవాలి.
అండర్ లైన్ చేసుకోవాల్సిన వ్యాఖ్యలు
- సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు మోడీ ప్రాధాన్యమిస్తున్నారు.
- ఆసరా పింఛన్లు, దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి ఉచిత పథకాలను బీజేపీ ప్రభుత్వం వద్దంటోంది. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
- దేశ రాజకీయాల్లో కవాతు చేసేందుకు పోదామా? ఎంతకైనా తెగిద్దామా?
- చిన్న పొరపాటుతో ఆంధ్రాలో కలిపితే.. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల భారీ ప్రాజెక్టు నిజాంసాగర్ ను నిర్మించుకున్న రాష్ట్రం మనది.
- వలస పాలనలో ఆ నీళ్లు మనకు రాకుండా చేయటంతో ఇబ్బంది పడ్డాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.