Begin typing your search above and press return to search.
తాలిబన్ల చేతిలో కీలకమైన డేటా ?
By: Tupaki Desk | 11 Sep 2021 6:49 AM GMTతొందరలోనే ఆఫ్ఘనిస్ధాన్లో తాలిబన్ల వేట మొదలు కాబోతోంది. తాలిబన్ల వేట దేనికంటే గడిచిన 20 ఏళ్ళుగా తమకు వ్యతిరేకంగా అమెరికా, ఇండియాలకు సహకరించిన ఆఫ్ఘన్ల కోసం. 1996-2001 మధ్యలో దేశాన్ని పాలించిన తాలిబన్లను ఏరిపారేయడానికి అమెరికా స్ధానిక ప్రజలనే ఉపయోగించుకున్నది. తాలిబన్ల పాలనతో విసిగిపోయిన చాలామంది స్థానికులు తాలిబన్ల రహస్యాలగురించి చెప్పేందుకు ముందుకొచ్చారు. వీళ్ళసాయంతోనే దేశంలో ఎక్కడ కూడా తాలిబన్లన్న వాళ్ళని లేకుండా చేసేసింది అమెరికా.
అగ్రరాజ్యం సైన్యం దెబ్బకు తాలిబన్లు తోకముడిచేసి హైడౌట్లలోకి పారిపోయారు. తమకు సహకరించిన స్ధానికులకు అమెరికా సాయం చేద్దామని అనుకున్నది. అందుకనే అవసరమన్నవాళ్ళకు జీతాల రూపంలో డాలర్లను పంచింది. అలాగే అమెరికాలో స్ధిరపడాలని అనుకున్నవాళ్ళకి చదువుల కోసమనో లేకపోతే ఉద్యోగాల పేరుతోనో చాలామందికి వీసాలు, పాస్ పోర్టులు మంజూరు చేసింది. తమ పిల్లలు చదువులు అయిపోగానే వాళ్ళని అమెరికాకు తీసకుపోతామనే హామీతో కూడా చాలామంది అమెరికాకు సాయంగా నిలిచారు ఇన్ని సంవత్సరాలు.
తమకు సాయంగా నిలుస్తున్న స్ధానికుల వేలిముద్రలు, ఐరిస్ లను కూడా అమెరికా తీసుకున్నది భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా. మొత్తం 2.5 కోట్లమంది ఆప్ఘన్ దేశస్తుల వేలిముద్రలు, ఐరిస్ రికార్డులు అమెరికా, బ్రిటన్ దగ్గర ఉన్నట్టు సుమాచారం. అంటే ఈ రెండింటి కారణంగా తమకు సహకరిస్తున్న ఆఫ్ఘన్ ప్రజల పూర్తి వివరాలను అమెరికా రెడీగా తమ దగ్గర పెట్టుకున్నదన్నమాట. ఇపుడా డేటానే ఆఫ్ఘన్ దేశస్తుల కొంప కూల్చేయబోతోందనేది అర్ధమైపోతోంది.
ఎలాగంటే దేశం నుంచి అమెరికా సైనికులు ఖాళీ చేసే రోజు దగ్గర పడుతున్న సమయంలో ఊహించిన దానికన్నా ముందే ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. దేశాన్ని వదిలి వెళ్ళేపోయే సమయంలోనే అమెరికా దగ్గరున్న డేటాలో చాలా భాగాన్ని తాలిబన్లు తీసేసుకున్నారట. తమకు అందిన డేటాను పాకిస్దాన్ లోని ఐఎస్ఐ సాయంతో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అందిన డేటా ఆధారంగానే తాలిబన్లు జాబితాలను సిద్ధం చేసుకుని అమెరికా సైన్యానికి సాయం చేసిన స్ధానికుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
అడ్రసులు దొరికిన కొందరిని పట్టుకుని అమెరికా సైన్యం దేశంలో ఉండగానే కాల్చి చంపేశారు. సాయం చేసిన వాళ్ళు ఎవరో అమెరికాకు తెలుసు, సాయం చేసిన స్థానికులకు తెలుసు. అందుకనే తమకు కూడా తాలిబన్ల చేతుల్లో చావు తప్పదని అర్ధమైపోయిన కారణంగానే దేశాన్ని వదిలేసేందుకు ఆఫ్ఘన్లు అంతగా ఆతృత పడ్డారు. తాలిబన్ల చేతిలో చనిపోయేకన్నా ఎక్కడా అమెరికాలోనో లేకపోతే ఏదో దేశంలో అడుక్కునైనా బతుకుదామన్న ఆలోచనతోనే స్ధానికులు దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగలిగారు లేనివాళ్ళు దేశంలోనే ఉండిపోయారు. ఇపుడు అలాంటి వాళ్ళే తాలిబన్లకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. కానీ ఎంతకాలం తప్పించుకోగలరు ?