Begin typing your search above and press return to search.
హీరో కంటే ఒకప్పటి హీరోయిన్ కే ఆస్తులెక్కవ
By: Tupaki Desk | 30 April 2019 7:38 AM GMTబాలీవుడ్ హీరో ధర్మేంద్ర అంటే తెలియని వారుండరు.. స్టార్ హీరోగా హిందీ జనాలను ఉర్రూతలూగించారు. ఆయన టైం అయిపోయాక ఇప్పుడు ఆయన వారసులు బాలీవుడ్ లో వెలగారు. ఆయన తనయుడు సన్నీడియోల్ ఒక దశలో స్టార్ హీరోగా బాలీవుడ్ ను ఏలారు. కానీ ఆ తర్వాత అవకాశాలు లేక ప్రస్తుతం కనుమరుగైపోయారు.
అయితే సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన సినీ ప్రముఖులు అందరూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఖాయమే.. తెలుగులోనూ, హిందీలోనూ సినీ ప్రముఖులు ఈ సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ కోవలోనే నటుడు ధర్మేంద్ర కుటుంబం కూడా ఈ సార్వత్రిక ఎన్నికల వేళ బరిలో నిలిచారు. సతీమణి హేమమాలిని మధుర నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఇక ధర్మేంద్ర తనయుడు సన్నీడియోల్ పంజాబ్ లోని గురుదాస్ పుర నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
అయితే వీరి ఆస్తుల డిక్లరేషన్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ధర్మేంద్ర సతీమణి హేమమాలిని మధుర నుంచి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులను 100 కోట్ల కు పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక ఇదే సమయంలో సన్నీడియోల్ తన ఆస్తులను 87 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇదీ తన పేరిట - తన భార్య పేరిట ఆస్తున్నట్టు చూపించారు.
అయితే హేమమాలినీ హీరోయిన్ గా చేసి చాలా ఏళ్లు అయ్యింది. దశాబ్ధాల కిందట ఆమె సంపాదించింది తక్కువే. అయినా 100 కోట్లకు పైగా ఆస్తులను ఆమె చూపించడం విశేషం. ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ మాత్రం కేవలం సొంత పిన్ని కంటే తక్కువే ఆస్తులుండడం విశేషంగా చెప్పవచ్చు.