Begin typing your search above and press return to search.
తెలంగాణలో కరోనా: హైకోర్టు కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 17 Jan 2022 12:04 PM GMTతెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 2000కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు చెప్పినట్టుగా థర్డ్ వేవ్ మొదలైందా? అనే భయాందోళనలు కలుగుతున్నాయి.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ హెచ్చరించినట్టే కేసులు పెరుగుతున్నాయి. రానున్న రెండు వారాలు చాలా జాగ్రత్తలు పాటించాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో అధికారులు చెప్పినట్టు తెలంగాణలో థర్డ్ వేవ్ సంకేతాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.
ఇక తెలంగాణలోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మహబూబాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని గురుకులాల్లో తాజాగా కరోనా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సోకింది. దీంతో తెలంగాణలో థర్డ్ వేవ్ మొదలైనట్టేనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.
కరోనా వ్యాప్తి నియంత్రణపై ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 25వ తేదీనికి వాయిదా వేశారు.