Begin typing your search above and press return to search.

గూగుల్​ నుంచి కీలక ఉద్యోగి అవుట్​..! సారీ చెప్పిన సుందర్​ పిచాయ్​..! ఇంతకీ ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   11 Dec 2020 9:25 AM GMT
గూగుల్​ నుంచి కీలక ఉద్యోగి అవుట్​..! సారీ చెప్పిన సుందర్​ పిచాయ్​..! ఇంతకీ ఏం జరిగింది?
X
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ.. గూగుల్​ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం సంస్థ సీఈవో సుందర్​ పిచాయ్​ తాజాగా స్పందించారు. టిమ్నిట్​ గెబ్రా గూగుల్​ నుంచి తప్పుకోవడం బాధాకరమని.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని సుందర్​ పేర్కొన్నాడు. టిమ్నిట్ గెబ్రూ గూగుల్​ ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాలర్. గూగుల్​ సంస్థ పురోగతికి ఆమె ఎంతోగానో తోడ్పడ్డారు. గూగూల్​ పబ్లిక్​ ఇమేజ్​ను బెటర్​ చేసేందుకు గెబ్రు ఎంతో శ్రమించారు. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ టెక్నాలజీలోని అనేక సమస్యలను ప్రశ్నించారు. ఆమె సడెన్​గా సంస్థ నుంచి నిష్క్రమించారు.

టిమ్నిట్​ గూగుల్​ ను వీడటం ప్రపంచవ్యాప్తంగా సాప్ట్​వేర్​ రంగంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ఆయన అకస్మికంగా బయటకు వెళ్లడం బాధకరమన్నారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి గూగుల్ సమీక్షిస్తుందన్నారు. నిజానికి గెబ్రూ ను గూగుల్​ సంస్థ తొలగించింది. కానీ ఈ విషయాన్ని వాళ్లు రాజీనామాగా ప్రకటించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో సుందర్​ పిచాయ్​ రంగంలోకి దిగాడు. ‘గెబ్రూ తొలగింత తన దృష్టికి వచ్చింది. ఈ తొలగింత ఎన్నో అనుమానాలకు తావిచ్చింది.

మరింత మంది ఉద్యోగులు ప్రశ్నించేందుకు తావిచ్చింది. దీని పట్ల నేను క్షమాపణ చెబుతున్నాను. మీ నమ్మకాన్ని పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంటున్నాను' అని సుందర్ పిచాయ్ అన్నారు. అయితే గూగుల్​లోన చాలామంది ఉద్యోగులు గెబ్రూకు అండగా నిలబడ్డారు.