Begin typing your search above and press return to search.
రైతు ఉద్యమంలోని కీలక ఘట్టాలు ఇవే..
By: Tupaki Desk | 12 Dec 2021 11:30 AM GMTకేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పార్లమెంట్లో రద్దు బిల్లు ఆమోదం తెలపడంతో వ్యవసాయ చట్టాలు ఉండవని క్లారిటీ వచ్చేసింది. అయితే ఏడాది పాటు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో కొనసాగిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచినట్లయింది. ఎండనకా.. వాననకా ఢిల్లీ సరిహద్దుల్లో తిష్టవేసిన రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు నిష్క్రమించమని భీష్మించుకు కూర్చున్నారు.
అనుకున్నట్లుగా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాక ఇక్కడి నుంచి కదల్లేదు. అయితే వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే కాదు, తమ డిమాండ్లను అంగీకరించాలని తెలపడంతో అందుకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. దీంతో ఉద్యమం చేస్తున్న రైతులు ఇంటిదారి పట్టారు. అయితే ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం మాములుది కాదనే చెప్పాలి సంవత్సరం పాటు ఈ ఉద్యమంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్నింటి గురించి పరిశీలిస్తే..
ఏపీఎంసీ బైసాస్ చట్టం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం, ఎసెన్షియల్ కమడిడీస్ చట్టం.. అనే మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప చేసుకుంది. ఆ తరువాత హడావుడిగా రాష్ట్రపతి సంతకం వరకూ ఎక్కడా ఆలస్యం చేయకుండా చట్టాలను చేసింది. అయితే ఈ విషయంలో రైతులను సంప్రదించకుండా 2020 జూన్ లో ఆర్డినెన్స్ కూడా తెచ్చింది. మెజారిటీ ప్రజల బతుకుదెరువు వ్యవసయాంతో ముడిపడి ఉన్నందున ఈ చట్టాలు వారికి బతుకును నాశనం చేస్తాయని రైతులు భావించారు. అందుకే ఉద్యమానికి పూనుకున్నారు.
ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీ బాట పట్టారు. అయితే ప్రభుత్వం వారిని ఢిల్లీ సరిహద్దుల్లోనే నిలిపింది. వారు రాకుండా లాఠీచార్జి చేసింది, గ్యాస్, వాటర్ కేనన్స్ ప్రయోగించింది. దీంతో రైతులు సింఘా, టిక్రీ, ఘాజీపూర్ ల వద్ద రైతులు టెంట్లు వేసి ధర్నాలకు దిగారు. అయితే రైతుల ఉద్యమం ఉద్రిక్తంగా మారడం చూసి ప్రభుత్వం రైతులతో పలుసార్లు చర్చలు జరిపింది.కానీ ఈ చట్టాల సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అయితే దీనిపై కొందరు సుప్రీంను ఆశ్రయించడంతో సాగు చట్టాల అమలును స్టే విధించింది.
గతేడాది రిపబ్లిక్ అంటే జనవరి 26 రోజుల రైతులు నిర్వహించిన ట్రాక్టర్ మార్చ్ హింసాత్మకంగా మారింది. ఇందులో ఓ రైతు చనిపోయాడు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎర్రకోటపైన సిక్కు మతానికి చెందిన నిషాన్ షాహిబ్ అనే వ్యక్తి జెండాను ఎగురవేయడం, అనేక మంది రైతులకు,పోలీసులకు గాయాలు కావడంతో ఉద్యమ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తాయి. ఇదే సమయంలో ప్రభుత్వం రైతు ఉద్యమంలో ఖలిస్తానీలు చొరబడ్డారని ఆరోపణ చేసింది. దీంతో ఉద్యమం నీరుగారుతుందన్న సమయంలో రైతులపై కొందరు బీజేపీ కార్యకర్తలు దాడు చేశారని, ఆ సంఘటనపై రైతు ఉద్యమ నాయకుడు టికాయత్ కన్నీల్లు పెట్టుకోవడంతో మరోసారి ఉద్యమం ఊపందుకుంది.
రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా కూడా మద్దతు లభించింది. సెలబ్రెటీ సింగర్ రియా, పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ ఒక ట్వీట్ చేయడంతో వివాదంగా మారింది. దీంతో ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమంగా అంతర్జాతీయ కుట్రగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్లో లఖీంపూర్లో డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా చట్టాలు వెనక్కి తీసుకోవాలంటూ రైతులు నిరసన తెలిపారు. అయితే వారిపై నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ముగ్గురు రైతులను కారుతో తొక్కించాని భారతీయ కిసాన్ యూనియన్ ఆరోపించింది. దీంతో బీజేపీపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే మోదీ ప్రభుత్వం చట్టాలను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 1న చట్టాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్ ప్రకటించింది.