Begin typing your search above and press return to search.
ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేసేది ఇదేనా?
By: Tupaki Desk | 27 Dec 2019 4:19 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి.. మంత్రివర్గ సమావేశం మీద పెద్ద ఆసక్తి ఉండదు. రోటీన్ అన్నట్లుగా ఫీల్ అవుతారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది.
దీంతో.. ఈ రోజు ఉదయం (శుక్రవారం) 11 గంటల వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్వర్యంలో జరిగే కేబినెట్ సమావేశంలో రాజధాని మార్పుపై కీలక ప్రకటన వెలువడటం ఖాయమంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్చే ప్రకటన వెలువడటం సాంకేతికమేనని.. ఇప్పటికే అంతా డిసైడ్ అయిపోయిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
మార్చి.. ఏప్రిల్ నాటికి అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతారన్న ప్రకటన వెలువడే వీలుందని చెబుతున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వ అవసరాలకు.. సెక్రటేరియట్ కార్యకలాపాలకు అవసరమైన భవనాల్ని వెతకటం.. అందులో మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయటం లాంటివి ఉంటాయని చెబుతున్నారు. ఎవరెన్ని చెప్పినా అమరావతి నుంచి విశాఖకు ఏపీ రాజధాని మారటం ఖాయమని తేలుస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి..రాజధాని మార్పు విషయంలోజగన్ ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశమే లేదని చెప్పక తప్పదు.