Begin typing your search above and press return to search.
ఏపీ కేబినెట్ లో ఏమేం నిర్ణయాలు తీసుకున్నారంటే?
By: Tupaki Desk | 27 Dec 2019 1:08 PM GMTఅనుకున్నట్లే ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగినా.. అందరి అంచనాలకు భిన్నంగా ఏపీ సర్కారు వ్యవహరించింది. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించటం ఖాయమనుకుంటే.. అనూహ్యమైన నిర్ణయాన్ని వెల్లడించి షాకిచ్చారు. తొందరపాటుతో తాము రాజధాని నిర్ణయాన్ని ప్రకటించటం లేదన్న సంకేతాల్ని ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానుల విషయంలో తమ సర్కారుకున్న విజన్ విషయంలో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించారని చెప్పాలి.
మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్ నిర్ణయాల్ని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఏమేం చెప్పారంటే..
% రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబుకు వాటాలు ఉన్న కంపెనీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ జరిపిస్తాం. లోకయుక్త, సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించేలా నిర్ణయం ఉంటుంది.
% 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎస్టీలకు 4 శాతం, ఎస్సీలకు 19.08, బీసీలకు 38 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఈ మేరకు తీర్మానం చేశామని పేర్కొన్నారు.
% రాజధానిపై జీఎన్‌రావు కమిటీ సమర్పించిన నివేదికపై కేబినెట్ చర్చించాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి రాజధాని నిర్మాణం జరపాలా? లేదా ప్రజలకు మెరుగైన వైద్యం - విద్య - మౌలిక సదుపాయాలు కల్పించాలా అనేదానిపై సుదీర్ఘంగా చర్చించాం.
% జీఎన్ రావు కమిటీతో పాటు శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రిమండలి అధ్యయనం చేసింది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.
% గత ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన అవినీతి - కుంభకోణాలుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించింది. వాటిపై మంత్రి మండలి చర్చించింది.
% చంద్రబాబుకు వాటాలు ఉన్న ఓ కంపెనీ రాజధాని ప్రకటనకు ముందే భూములు కొనుగోలు చేసింది. కొందరు మంత్రులు కూడా భూములు కొనుగోలు చేశారు. ఆస్తులు అక్రమంగా కొన్నవారు శిక్ష అనుభవించక తప్పదు.
% న్యాయనిపుణుల సలహా అనంతరం వీటిపై విచారణను ఆదేశిస్తాం. 2015లో అప్పటి ప్రభుత్వం ఊహాజనితమైన రాజధాని నిర్మించాలని కలలు కన్నది. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కింది.
% నాటి మంత్రి నారాయణ ఇచ్చిన నివేదిక మాత్రమే పరిగణలోకి తీసుకుంది. 33 వేల ఎకరాల రైతుల భూములను - మరో ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూములను కలిపి మొత్తం 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక లక్షా పదివేల కోట్ల రూపాయిలకు పైగా రాజధాని నిర్మాణానికి అంచనా వేశారు. కానీ ఐదేళ్ల కాలంలో కేవలం 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
% రాజధాని భూములపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజధాని రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారు.
% ‘దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన 108 అంబుల్సెన్స్ వాహనాలను గత సీఎం చంద్రబాబు భ్రష్టు పట్టించారు. వాటిని మరింత పటిష్టం చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. 412 కొత్త వాహనాలకు కొనుగోలు చేస్తాం.