Begin typing your search above and press return to search.

కేంద్రంలో సామాన్యుల బ‌డ్జెట్..మోడీ వ్యూహం అదిరిందిగా

By:  Tupaki Desk   |   5 July 2019 7:01 AM GMT
కేంద్రంలో సామాన్యుల బ‌డ్జెట్..మోడీ వ్యూహం అదిరిందిగా
X
కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ సామ‌న్యుల‌ను అల‌రించేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోడీ త‌మ ప్ర‌భుత్వం సామాన్యుల కోసం దిగివ‌స్తుంద‌ని చెప్పిన మాట‌ల‌ను ఆయ‌న సాకారం చేసుకున్నారు. తాజాగా బ‌డ్జెట్‌ ను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. సామాన్యుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ముఖ్యంగా సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను దృష్టి పెట్టుకుని వండి వార్చిన బ‌డ్జెట్‌ లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మకంగా భావిస్తున్న ముద్ర రుణాల‌కు మ‌రోసారి పెద్ద పీట వేసింది.

ముద్ర రుణాల ప‌రిమితిని మ‌రింత పెంచ‌డం ద్వారా ఔత్సాహిక చిన్న పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా కేంద్రం అడుగులు వేసింది. అదే స‌మ‌యంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్స‌హించేందుకు ప్ర‌త్యేకంగా నిధుల‌ను కేటాయించ‌నున్న‌ట్టు బ‌డ్జెట్‌ లో ప్ర‌క‌టించారు. టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని - ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 1.5ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచామని నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు.

ప్రస్తుత ఏడాదిలో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌ లో ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరడమే తమ లక్ష్యమని నిర్మల చెప్పారు. నవీన భారత్‌ రూపకల్పనకు ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. చిన్న - మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని - ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని నిర్మల చెప్పారు. మేకిన్‌ ఇండియాకు మంచి స్పందన వచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

మొత్తంగా చూసుకుంటే.. బ‌డ్జెట్ సామాన్యుల‌ప క్షాన నిలిచేదిగా ఉంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఐదేళ్లో ప్ర‌తి ఇంటికీ మ‌రుగుదొడ్డి ఉండాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకోవ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా కేంద్రం పెద్ద పీట వేసింది. మొత్తానికి ఈ బ‌డ్జెట్ ఆశ‌ల ప‌ల్ల‌కినికాకుండా నిజ‌మైన ఆశ‌ల‌నే మొసుకొచ్చింద‌ని చెప్పాలి.