Begin typing your search above and press return to search.
కేసీఆర్ కేబినెట్ జాబితాలో ఉండేది వీరేనా?
By: Tupaki Desk | 31 Jan 2019 3:56 AM GMTబలమైన ముఖ్యమంత్రులు చాలా మందే ఉన్నా.. మొహమాటాలు.. ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావటం.. మరో ప్రజాదరణ ఉన్న నేత విషయంలో కాస్త రాజీ పడటం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు పూర్తి భిన్నం. కేసీఆర్ ఒకప్పటి గురువైన చంద్రబాబు సైతం మొహమాటంతో రాజీ పడుతుంటారు. కానీ.. కేసీఆర్ మాత్రం అలాంటివేవీ ఉండవని చెబుతారు.
సమకాలీన రాజకీయాల్లో తెలుగు గడ్డ మీద ఎన్టీఆర్ తర్వాత తిరుగులేని రీతిలో రాజకీయాల్ని నడిపించిన అధినేత కేసీఆర్ మాత్రమేనని చెప్పక తప్పదు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కావొచ్చు.. మంత్రివర్గ విస్తరణ కావొచ్చు. ఏదైనా సరే.. తనకు నచ్చినప్పుడు.. తోచినప్పుడు మాత్రమే చేయటం తప్పించి.. ఎవరి కోసమో ఏదో చేయాల్సిన పరిస్థితి కేసీఆర్ కు అస్సలు లేదు.
ఈ కారణంతోనే ఫలితాలు వచ్చిన ఇంతకాలమైనా మంత్రివర్గవిస్తరణ లేకుండా బండి లాగిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో పాటు.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలకు మంత్రుల అవసరం ఉండటంతో మరో వారం వ్యవధిలో కేబినెట్ ను విస్తరిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తనతో పాటు ఉప ముఖ్యమంత్రి.. హోంమంత్రిగా మహమూద్ అలీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఇప్పటివరకూ మంత్రివర్గాన్ని విస్తరించలేదు.
మరో వారం వ్యవధిలో విస్తరించనున్న కేబినెట్ లో ఎవరికి చోటు లభించనుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన నిర్ణయాన్ని ప్రశ్నించటం తర్వాత.. కనీసం చర్చ జరిపే సీన్ కూడా లేని ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులుగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ ఎస్ లో తొలి నుంచి కేసీఆర్ తో ఉండి.. తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లకు కేసీఆర్ హ్యాండివ్వటం ఖాయమంటున్నారు.
మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కనుందన్న విషయానికి వస్తే.. ఈసారి విస్తరణలో మొత్తం పది మందిని తీసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. కేసీఆర్ అదృష్ట సంఖ్యలుగా 3..6..9 చెబుతుంటారు. పది మందిని తీసుకుంటే.. కేసీఆర్... మహమూద్ అలీని కలిపితే.. పన్నెండు మంది అవుతారు. 12 లోని రెండు అంకెల్నికలిపితే మూడు అవుతుంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం పది మందికి తొలి విస్తరణలో అవకాశం లభిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల జాబితాను చూస్తే..
1. ఈటల రాజేందర్
2. హరీశ్ రావు/ఎర్రబెల్లి
3. వేముల ప్రశాంత్ రెడ్డి
4. తలసాని శ్రీనివాస్
5. నిరంజన్ రెడ్డి/లక్ష్మారెడ్డి
6. జగదీశ్ రెడ్డి/గుత్తా
7. కొప్పుల ఈశ్వర్
8. రెడ్యానాయక్
9. పద్మాదేవేందర్ రెడ్డి
10. పట్నం నరేందర్ రెడ్డి