Begin typing your search above and press return to search.
కేసీఆర్ ప్రెస్ మీట్ కు సీన్లోకి వచ్చిన కేంద్రమంత్రి.. ఏం చెప్పారంటే?
By: Tupaki Desk | 12 Nov 2021 5:30 AM GMTఇవాల్టి నుంచి నేనే నేరుగా వచ్చేస్తా. డైలీ బేసిస్ లో ప్రెస్ మీట్లు పెడతా.. ఇక వదిలి పెట్టనంటూ.. ఆవేశంతో రెండు రోజుల పాటు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు నేతలపైనా.. కేంద్రం పైనా విమర్శలతో పాటు బలమైన ఆరోపణలు చేయటం తెలిసిందే. కేసీఆర్ ప్రెస్ మీట్ల ప్రభావం ఢిల్లీ మీదా పడినట్లుగా ఉంది. గతంలో కేంద్రం మీద ఘాటు విమర్శలు చేసినా స్పందన అంతంత మాత్రమే అన్నట్లు ఉండే దానికి భిన్నంగా తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కౌంటర్ ప్రెస్ మీట్ ఇప్పుడు కొత్తగా మారింది.
ప్రెస్ మీట్ లో భాగంగా కేంద్రం మీద విమర్శలు.. ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ మాటలకు.. చేతలకు మధ్య తేడాను ఆయన బయటపెట్టారు. ఏపీ.. తెలంగాణ మధ్య జలాల పంపిణీ పై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జరిగిన ఆలస్యానికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన కుండబద్ధలు కొట్టారు. 2015లో సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు కేంద్రాన్ని ఎలా నిందిస్తారు? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రాజెక్టులను క్రిష్ణా.. గోదావరి బోర్డులకు అప్పగించకపోతే రాజ్యాంగ నిబంధనలు ఉన్నట్లుగా పేర్కొన్న ఆయన.. ఒకింత వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ తన పేరును ప్రస్తావిస్తూ జలవివాదాలను లేవనెత్తారని.. అందువల్ల వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో తాను మీడియా భేటీని నిర్వహించినట్లు చెప్పారు. లైవ్ లో వర్చువల్ విధానంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసునని.. దాని గురించి తాను మాట్లాడబోమన్నారు.
‘అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం ట్రైబ్యునల్ వేయాలని 2015లో సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు వేసింది. 2020 అక్టోబరు 6వ తేదీన ఆ కేసును రెండురోజుల్లో వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ నాకు చెప్పారు. 8 నెలల తర్వాత కేసును వెనక్కితీసుకున్నారు. ఏడేళ్ల మీ నిర్లక్ష్యానికి కేంద్రం, నేను ఎలా బాధ్యులమవుతాం? పిటిషన్ ఉపసంహరణపై ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కేసీఆర్‌కు 8 నెలల సమయం పట్టింది. చివరికి ఈ ఏడాది అక్టోబరు 6న పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతించింది. పిటిషన్ ఉపసంహరణ తర్వాత ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాం.
అభిప్రాయం కోసం కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదనలు పంపించాం. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటున్నా. కేంద్ర న్యాయ శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి, వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కోరా. న్యాయ శాఖ నుంచి అభిప్రాయాలు అందిన తర్వాతే.. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా లేక పాత ట్రైబ్యునల్‌కే కొత్తగా విధివిధానాలను ఖరారు చేయాలా అన్నది తేలుతుంది’’ అని వివరంగా వెల్లడించారు.
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు పెద్ద ప్రక్రియ కాబట్టి జాప్యాన్ని నివారించడానికి పాత ట్రైబ్యునల్‌కే విధివిధానాలు ఖరారు చేయడానికి తాను మొగ్గుచూపుతున్నాని చెప్పిన కేంద్రమంత్రి.. రెండింటిలో ఏది జరిగినాఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచటంపై మాత్రమే ట్రైబ్యునల్ తేలుస్తుంది. న్యాయశాఖ అభిప్రాయం చెప్పే వరకూ ట్రైబ్యునల్ ఎప్పట్లో ఏర్పాటవుతుందో చెప్పలేమని తేల్చి చెప్పారు.
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకారంతో బోర్డుల పరిధుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశామన్న కేంద్రమంత్రి షెకావత్.. ‘ఇప్పుడు సీఎం కేసీఆర్ దాన్నో పెద్ద డ్రామాగా అభివర్ణిస్తున్నారు. సీఎం అలా అనటం ప్రజాస్వామిక వ్యవస్థ.. రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయటంగా భావిస్తున్నా. వాస్తవ పరిస్థితులు దేశ ప్రజల ముందు ఉండాలి. నాణెనికి రెండో కోణం కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే తానీ సమావేశాన్ని నిర్వహించినట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే డీపీఆర్ లు సమర్పించినా కేంద్రం వాటిని పరిశీలించటం లేదని రెండు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి కదా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు స్పందించిన కేంద్రమంత్రి.. తన వద్దకు మీడియా ప్రతినిధులు రావాలన్నారు. ప్రాజెక్టులపై ఇరురాష్ట్రాలు సమర్పిస్తున్న డాక్యుమెంట్లను చూపిస్తానన్న ఆయన.. ‘ఏవో నా మాత్రపు పేపర్లు పంపిస్తే వాటిని డీపీఆర్ అని అనగలమా? మరింత లోతుగా మాట్లాడి వివాదాన్ని సృష్టించాలనుకోవడం లేదన్నారు. సరైన ఫార్మాట్ లో డీపీఆర్ లు రావటం లేదన్న ఆయన.. అసలు వివాదం లేని వాటిని కూడా ఎందుకు రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావటం లేదున్నారు. ఇప్పటివరకు కేంద్రం తీరుపై కేసీఆర్ చెప్పిన మాటలు విన్న వారికి కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలు కొత్త కోణాన్ని చూపించాయని చెప్పాలి. మరి.. షెకావత్ ప్రెస్ మీట్ వేళ.. కేసీఆర్ మరో మీడియా సమావేశాన్నినిర్వహిస్తారా? లేక మౌనంగా ఉంటారా? అన్నది తేలాలి.