Begin typing your search above and press return to search.
కరోనా కట్టడిలో గ్రామ వలంటీర్ల కీ రోల్!
By: Tupaki Desk | 23 March 2020 7:30 AM GMTకరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సీఎం జగన్ అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా తీవ్రత తక్కువే ఉన్నప్పటికీ....పది రోజుల పాటు ఏపీని లాక్ డౌన్ చేయడం ద్వారా ఆ వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయాలని సీఎం జగన్ చర్యలు చేపట్టారు. కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం జగన్ చేపట్టిన చర్యలపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కరోనాపై ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య శాఖాధికారులకు చెప్పిన జగన్...ఎప్పటికప్పుడు వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన సీఎం జగన్...వారి వివరాలను గ్రామ సెక్రటేరియట్ల ద్వారా సమీక్షిస్తున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సుభిక్షంగా ఉందని, కరోనాను కట్టడి చేసేందుకు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియాతో పాటు పలు రంగాల వారు ఎనలేని సేవలందిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తూ ప్రజలను వైరస్ బారిన పడకుండా కాపాడుతున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే....గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్ల వ్యవస్థ కరోనా కట్టడిలో యాక్టివ్ గా పనిచేస్తోంది. ఏపీకి మాత్రమే సొంతమైన వలంటీర్ల వ్యవస్థను జగన్ కరోనా కట్టడి సమయంలో తెలివిగా వాడుకుంటున్నారు. విదేశాలనుంచి వచ్చిన కొందరు తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి సమయంలో వలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టి విదేశీయుల వివరాలను పక్కాగా లెక్కగట్టారు. దీంతో, విదేశాల నుండి వచ్చిన 11,670 మందిని గ్రామ, వార్డు వలంటీర్ల సర్వే ద్వారా గుర్తించామని సీఎ జగన్ అన్నారు. కరోనా వ్యాప్తి విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సుభిక్షంగా ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.