Begin typing your search above and press return to search.

కిలో టీపొడి రూ.2.5 లక్షలు.. ఎందుకంత ధరనో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:30 PM GMT
కిలో టీపొడి రూ.2.5 లక్షలు..  ఎందుకంత ధరనో తెలుసా?
X
పుర్రెకో రుచి అంటారు. ఈ మధ్యకాలంలో మధ్యతరగతి వారు కూడా ఖరీదైన తిండి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత తిని పడుకోవడాన్ని అలవరుచుకున్నారు. మనవలు.. మునిమనవలకు సంపాదించడం కన్నా తాము బాగుంటే చాలు అని అనుకుంటున్నారు. టీ పొడి మహా అయితే మార్కెట్లో రూ.200 కిలో దొరుకుతుంది.. ఇంకొన్ని 500 లోపే ఉంటాయి. కానీ ఇదే వేలం వెర్రినో కిలో రూ.2.5 లక్షలపైనే టీపొడి ధర పెట్టారు. ఎందుకయ్యా అంటే బంగారం ఫ్లేవర్ అంట.. ఇదేం విచిత్రమో కానీ ఇదిప్పుడు వైరల్ గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన టీపొడికి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ టీపొడి బాగా పెంచే మన ఈశాన్య భారతంలోని అసోంకు చెందిన ఆరోమికా టీ అనే అంకుర సంస్థ 40 రకాల వైవిధ్యమైన రుచులను అందిస్తోంది. అందులో ఒకటి.. తాగేందుకు అనువైన 24 క్యారెట్ల బంగారం జత చేసిన బ్లాక్ టీ పొడి. దీని ధర ఎంతో తెలుసా? కిలో రూ.2.5 లక్షలు. ఇంత భారీ పెట్టి కొని తాగడానికి కోటీశ్వరులే కావాలి మరీ..

ఇదే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఘాటు మిరపకాయ అయితన ‘భూత్ జోలాకియా’ రుచితో సిద్ధం చేసిన పొడిని కూడా రూపొందించినట్టు ఆ కంపెనీ అధికారి రంజిత్ బారువా పేర్కొన్నారు.

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వినియోగదారులకు ఆరోగ్య సృహ పెరగడంతోపాటు ప్రత్యేక రుచుల కోసం ఎదురుచూస్తున్నారని.. అలాంటి వారి కోసమే ‘ఆరోమికా టీ’ బ్రాండ్ కింద 40కి పైగా ప్రత్యేక, విలాసవంత రుచులను సృష్టించామని తెలిపారు.

‘భూత్ జోలాకియా లేదా ఘోస్ట్ పెప్పర్’ రుచితో అందిస్తున్న టీ కోసం పేటెంట్ కు దరఖాస్తు చేశామని.. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాస్టస్ ఇగ్నిస్ మొక్క ఆకులతో చేసిన ప్రత్యేక ‘ఇన్సులిన్’ టీ పొడిని కనిపెట్టినట్లు తెలిపారు. ఇది శరీరంలో చక్కెర స్తాయిలను స్థిరపరుస్తుందని అంటున్నారు.

‘మోరింగ’, తులసి, రకాల పొడితో ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.