Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకతలు తెలుసా..

By:  Tupaki Desk   |   14 Sep 2015 10:33 AM GMT
ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకతలు తెలుసా..
X
ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా చాలాకాలం పాటు ఏటా ఏపీలో అతిపెద్ద వినాయకుడిగా పేరొంది... ఇప్పటికీ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడికి దేశమంతా భక్తులున్నారు. జంటనగరాల్లో ఎక్కడున్నవారైనా వినాయచవితి సమయంలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవాల్సింది. హైదరాబాద్ బయట ప్రాంతాల నుంచీ భక్తులు ఇక్కడికి వస్తారు. అలాంటి ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాదీ ఉత్సవాలకు సిద్ధమయ్యాడు. ఈసారి త్రిశ‌క్తిమ‌య మోక్ష గ‌ణ‌ప‌తిగా భక్తులకు దర్శనమివ్వనున్న వినాయకుడి విశేషాలు చూద్దాం. తెలంగాణలోని నల్గొండ - ఆదిలాబాద్ తదితర ప్రాంతాల కళాకారులు - కార్మికులు... అలాగే ఏపీలోని కాకినాడ - విజయవాడ ప్రాంతాలకు చెందిన నిపుణులు ఖైరతాబాద్ గణేశుని నిర్మాణం.. ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు.

- ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు 59 అడుగులు, వెడల్పు 26 అడుగులు

- దీనినిర్మాణానికి జూన్ 12న తొలిపూజలు చేశారు. 26 నుంచి ప్రధాన పనులు మొదలయ్యాయి. - - షెడ్డు కోసమే 22 టన్నుల కలప వినియోగించారు.

- ఆదిలాబాద్‌ కు చెందిన సుధాకర్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం మండపం వేశారు.

- దీనికి గోవానుంచి 50 బండిళ్ల తాళ్లు తెప్పించి ఉపయోగించారు.

- విజయవాడకు చెందిన శేషారెడ్డి నేతృత్వంలో 20 మంది టీం వెల్డింగ్ పనులు చేశారు.

- చెన్నైకి చెందిన మూర్తి నేతృత్వంలో మహారాష్ట్ర, బెంగాల్ - బీహార్‌ ల నుంచి 35 మంది వ‌చ్చి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పనులు పూర్తి చేశారు.

- కాకినాడకు చెందిన భీమేష్ ఆధ్వర్యంలోని 25 మంది పెయింట‌ర్లు విగ్రహానికి రంగులేశారు.

- వినాయకుడి చేతిలో 6.5 టన్నులు లడ్డూను ఉంచుతున్నారు. ఈ ల‌డ్డూని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి తీసుకొస్తున్నారు.

- ఖైరతాబాద్ వినాయకుడికి మెడలో 25 మీటర్ల పొడవు... మీటరు వెడల్పు ఉన్న కండువా తయారు చేస్తున్నారు. ఇది నల్గొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండల పరిధి కనుముకుల గ్రామంలోని చేనేత పార్క్‌ లో మగ్గంపై నేస్తున్నారు.