Begin typing your search above and press return to search.
శ్రీదేవి లైవ్ అప్ డేట్స్ ఇస్తున్న దుబాయ్ మీడియా!
By: Tupaki Desk | 26 Feb 2018 4:29 AM GMTకోట్లాది మంది భారతీయులకు ఆరాధ్య నాయకిగా.. అతిలోక సుందరికి.. ముద్దమందారంగా మది నిండా నిండిపోయిన శ్రీదేవి.. కానరాని లోకాలకు వెళ్లిపోవటం.. ఇక ఎప్పటికి తిరిగి రాలేదన్న సత్యాన్ని జీర్ణించుకోవటం కష్టంగా మారింది. ఆమె మరణం కోట్లాది మంది మనసుల్ని చేదుగా మార్చేసింది.
భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి చెందిన ప్రముఖ సెలబ్రిటీ మరణించిన తర్వాత.. ఆమె పార్థిపదేహాన్ని అప్పగించేందుకు దుబాయ్ ప్రభుత్వం చెబుతున్న ప్రొసీజర్స్ ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. దుబాయ్ చట్టాల్ని కించపర్చటం.. తక్కువ చేయటం ఉద్దేశం కాకున్నా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. కోట్లాది మంది భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో కూడా రూల్స్ చెప్పి గంటల కొద్దీ సమయాన్ని వృధా చేయటం సరైంది కాదు కదా.
ఎవరి ప్రొసీజర్స్ వారికి ఉన్నట్లే.. ఎవరి సంప్రదాయాలు.. సెంటిమెంట్లు వారికి ఉంటాయి కదా. ఒక హిందువు మరణించిన 24 గంటల్లో దహనసంస్కారాలు చేస్తే.. మంచిదని చెబుతారు. ఆ కోణంలో చూసినప్పుడు మరణించిన వ్యక్తి అనుసరించే ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే కదా. చట్టాలు ఉండొచ్చు. కానీ.. కోట్లాది మంది భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించాల్సిన అవసరం ఉంది కదా.
ఒక వైద్యుడు తన టైం అయిపోయింది కాబట్టి వెళ్లిపోయి పక్కరోజు వచ్చి మిగిలిన పని చేయాలనటం సరైందేనా?
శ్రీదేవి విషయంలోనే చూస్తే.. ఆమె పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయి.. ఫోరెన్సిక్ క్లియరెన్స్ కోసం ఇప్పటివరకూ ఎదురుచూస్తున్న పరిస్థితి. అత్యాధునిక సాంకేతికతను ఉదయోగించే దుబాయ్ లాంటి దేశంలో.. రాజు తలుచుకోవాలే కానీ.. రిపోర్టులు వెంటనే రావా? అన్నది ప్రశ్న.
ఇదిలా ఉంటే.. శ్రీదేవికి సంబంధించిన వార్తల్ని దేశీయంగా అన్ని మీడియా సంస్థలు భారీగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దుబాయ్ కి చెందిన ఖలీజాటైమ్స్ శ్రీదేవి వార్తల్ని ప్రముఖంగా ఇవ్వటమే కాదు.. లైవ్ రిపోర్ట్ ను అందిస్తోంది. ఆ సంస్థకు చెందిన ట్విట్టర్ లోనూ.. ఎప్పటికప్పుడు శ్రీదేవి విషయంలో ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఇస్తోంది.
లింక్ కోసం..క్లిక్ చేయండి