Begin typing your search above and press return to search.
పోలీసుల సాయంతో బయటపడ్డ మంత్రులు
By: Tupaki Desk | 12 Sep 2015 4:14 PM GMTపోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. నిర్వాసితుల నిరసనల మధ్య అక్కడ నుంచి వారు బయటకు రాలేకపోయారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నాలుగు రోజులుగా ఏపీలో నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం వారు అక్కడ నుంచి బయలు దేరుతుండగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. తమకు తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారిని కదలనీయలేదు.
ఏపీ బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుతో పాటు మిగిలిన ఎమ్మెల్యే లు చాలా సేపు అక్కడే ఉండిపోయారు. పరిహారం త్వరలోనే వస్తుందని మంత్రి కామినేని, ఎంపీ హరిబాబు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా మీరు కల్లిబొల్లి కబుర్లు కట్టిపెట్టి...మాకు పరిహారం ఇవ్వండని నిలదీశారు. దీంతో బిత్తరపోయిన వారు చివరకు పోలీసులను ఆశ్రయించి వారి సహాయంతో అక్కడ నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఎంత వేగంగా ఫినిష్ చేశారో...ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం అంతే వేగంగా పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత త్వరగా ఏపీ ప్రజలకు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన సూచించారు. ఏదేమైనా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులకు పోలవరం నిర్వాసితులు పెద్ద షాకే ఇచ్చారనుకోవాలి.