Begin typing your search above and press return to search.

బైక్ పై లిఫ్ట్ ఇస్తే ఇక అంతే సంగ‌తులు!

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:30 PM GMT
బైక్ పై లిఫ్ట్ ఇస్తే ఇక అంతే సంగ‌తులు!
X
బైకుపైన వెళ్లేట‌ప్పుడు చాలామంది లిఫ్టు అడుగుతుంటారు. అయితే క‌రోనా వ‌చ్చాక చాలామంది లిఫ్టులు ఇవ్వ‌డం మానేశారు. ఎక్క‌డ వారికి క‌రోనా ఉంటే త‌మ‌కు అంటుకుంటుంద‌నే భ‌యంతో మార్గ‌మ‌ధ్యంలో ఎవ‌రైనా లిఫ్టు అడిగినా ఇవ్వ‌డం లేదు. ఇక రాత్రిళ్లు ముక్కూముఖం తెలియ‌ని వ్య‌క్తుల‌కు ఎవ‌రూ లిఫ్టు ఇవ్వ‌రు. ఆ బైకు ఎక్కేవాడు ఎలాంటివాడో తెలియ‌క‌పోవ‌డం, ఎక్కాక త‌మ‌ను ఏం చేస్తాడోన‌న్న భ‌య‌మే ఇందుకు కార‌ణం.

ఇప్పుడు ఇలాగే ఖ‌మ్మం జిల్లాలో ఇలాంటి దారుణ ఘ‌ట‌నే చోటు చేసుకుంది. త‌న బైకుపై ఒక వ్య‌క్తికి లిఫ్టు ఇచ్చిన పాపానికి ఒక దుండ‌గుడు అత‌డిని ఇంజెక్ష‌న్‌తో పొడిచి చంపాడు. ఖ‌మ్మం జిల్లా ముదిగొండ మండ‌లం బాణాపురంలో ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది.

ఈ దారుణ ఘ‌ట‌న వివరాల్లోకి వెళితే.. ఖ‌మ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (40) తన చిన్న కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు.

త‌న భార్య ప్రస్తుతం వల్లభిలో కుమార్తె వద్ద ఉండటంతో ఆమెను తీసుకొచ్చేందుకు జమాల్ సాహెబ్ త‌న బైకుపై తన ఇంటి ద‌గ్గ‌ర‌ నుంచి బయలుదేరి వెళ్లాడు. ఇంత‌లో వల్లభి సమీపంలోకి రాగానే దారిన పోతున్న‌ గుర్తు తెలియని వ్యక్తి జమాల్‌ను లిఫ్ట్‌ అడిగాడు. దీంతో జమాల్‌ అతడ్ని తన వాహనంపై ఎక్కించుకున్నాడు.

ఈ క్ర‌మంలో కొంత దూరంగా బైకుపై ప్ర‌యాణించ‌గానే బైకుపై లిఫ్టు అడిగిన వ్య‌క్తిని ఇంజెక్ష‌న్‌తో జ‌మాల్ సాహెబ్‌ను పొడిచాడు. దీంతో ఆందోళ‌న‌కు గుర‌యిన జ‌మాల్ బండి ఆప‌గానే నిందితుడు బైకు దిగి పారిపోయాడు. దీంతో ఈ విష‌యాన్ని జ‌మాల్ త‌న భార్య‌కు ఫోన్ చేసి చెప్పాడు. అనంత‌రం స్పృహ కోల్పోయి ప‌డిపోవ‌డంతో దారిన‌పోతున్న‌వారు ఆయ‌న‌ను 108లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే ఆస్ప‌త్రికి తీసుకెళ్లేలోపే జ‌మాల్ మార్గ‌మ‌ధ్యంలో మ‌ర‌ణించాడు. కాగా ఘటనాస్థలంలో ఇంజెక్షన్‌, సిరంజీ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ‌మాల్‌ మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.