Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు ఖమ్మం మాజీ నేతల జంపింగ్ ఖాయమా? ఒకటే చర్చ
By: Tupaki Desk | 26 March 2022 3:32 PM GMTతెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం తీరే వేరు.. 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆర్ఎస్ గాలి వీస్తే ఖమ్మంలో మాత్రం మహా కూటమి గెలిచింది. 2014 లోనూ అంతే. చిత్రమేమిటంటే.. ఈ రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది ఒక్కో సీటే. అయితే తర్వాత పరిస్థితులు మారాయనుకోండి. కానీ, జిల్లా రాజకీయాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.
ఆరోపణల పర్వం సాగుతోంది. పార్టీల కార్యక్రమాల్లో వేగం పెరిగింది. ఓ అత్యంత సీనియర్ నేత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మరో కీలక నేత స్తబ్దుగా ఉండడం, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోతుండడంతో చర్చ నడుస్తోంది.
ఇద్దరూ ప్రజా నాయకులే..
ఒకప్పుడు వామపక్ష పార్టీలు, టీడీపీ, కాంగ్రెస్ కు గట్టి పట్టున్న ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్ హవా సాగుతోంది. ఆ పార్టీదే అంతా ఆధిపత్యం. అలాంటి అధికార పార్టీకి 2018 ఎన్నికలు చేదు ఫలితం ఇచ్చాయి. టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం వంద అసెంబ్లీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుంటే 99 దగ్గరే ఆగిపోయింది. ఆ ఒక్కటీ ,అరా ఖమ్మం జిల్లా కారణంగానే టీఆర్ఎస్ లక్ష్యానికి గండిపడింది. పార్లమెంటు ప్రతినిధిగా ఉన్న నాయకుడు చేసిన కుట్ర కారణంగానే ఎమ్మెల్సే సీట్లు తగ్గాయనే ప్రచారం జరిగింది.
ముఖ్య నాయకుడు ఓడిపోవడానికి కూడా ఇదే కారణమంటూ గగ్గోలు పుట్టింది. దీంతో ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఖమ్మం జిల్లా నాయకత్వంపై గుర్రమంది. దీనిప్రభావంతో 2019 పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ నాయకుడికి టిక్కెట్ దక్కలేదు. అప్పటివరకు వైరి పార్టీలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచి.. ఢిల్లీలో పార్టీ సభాపక్ష బాధ్యతలు చూస్తున్నారు.
ఆ మాజీలిద్దరి గమ్యం ఏమిటో?
అసెంబ్లీ, పార్లమెంటు మాజీలిద్దరూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారని అంటున్నారు. వీరిలో ప్రస్తుతం అసెంబ్లీ మాజీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్ చల్ చేస్తున్నారు. పార్లమెంటు మాజీ నేత మాత్రం కనిపించడం లేదు. అయితే... ఎన్నోసార్లు అవకాశాలు ఉన్నప్పటికీ.. వీరిద్దరికీ సీఎం కేసీఆర్ వీరిద్దరికీ ఈ రెండో విడతలో పదవులు ఇవ్వలేదు. దీంతో ఒకరు ఓడిపోయి, మరొకరు టిక్కెట్టు రాకుండా మాజీలుగానే మిగిలారు.
వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్లు ఖాయమనే చెప్పే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో చివరకు ఇద్దరూ పార్టీలు మారినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. చిత్రమేమంటే.. ఇద్దరూ ఒకే పార్టీలోకి వెళ్తారా? లేదా..? వేర్వేరు పార్టీలను ఆశ్రయిస్తారా? చూడాలి. ఒక పార్టీలో ఉంటూ ఒకరి ఓటమికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొని ఒకరు, ఓడినా సానుభూతి దక్కక పదవులు రాని మరొకరు ఇద్దరూ ఒకచోటకు చేరితే అది మరింత ఆశ్చర్యమే.