Begin typing your search above and press return to search.

పాక్ బుద్ధి పోనిచ్చుకోలేదు

By:  Tupaki Desk   |   14 Oct 2015 7:17 PM GMT
పాక్ బుద్ధి పోనిచ్చుకోలేదు
X
పాకీ-స్తాన్ నాయ‌కులు, పౌరులు ఎవ‌రైనా వారు తమ బుద్ధిని పోనిచ్చుకోర‌నేది మ‌రోమారు నిజ‌మ‌యింది. భార‌త‌దేశంలో గొప్ప కార్య‌క్ర‌మాలు చేసేందుకు వ‌స్తున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తున్న‌ప్ప‌టికీ వారి మ‌న‌సుల్లో ఉండేది వేరే అని భావించిన శివ‌సేన పాక్ విదేశాంగ శాఖ మాజీమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంది. దీన్ని దేశంలో కొన్ని వ‌ర్గాలు అభ్యంత‌రం తెలిపాయి. అయితే తాజాగా భారతదేశంలో తన పర్యటన ముగియగానే క‌సూరి త‌న పాక్ పౌరుడైన క‌సూరి బుద్ధిని పోనిచ్చుకోలేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌ పై అవాస్త‌వ ప్ర‌క‌న‌ట‌నలు చేశారు.

సినీ దిగ్గ‌జమైన దిలీప్ కుమార్ రెండు సార్లు పాకిస్థాన్ లో రహస్యంగా పర్యటించారని క‌సూరి ఆరోపించారు. భారత ప్రభుత్వం కోసం ఈ ప‌ర్య‌ట‌న చేశార‌ని కూడా అనుమానాలు రేకెత్తించే కామెంట్ చేశారు. దిలీప్ కుమార్ భార్య సైరాబాను ఆయ‌న పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న గురించి వెల్ల‌డించార‌ని కూడా త‌న కామెంట్ల‌కు విశ్వ‌స‌నీయ క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతోనే ఆగ‌కుండా భారత ప్రభుత్వం ప్రత్యేకంగా సమకూర్చిన విమానంలో దిలీప్‌కుమార్ ఇస్లామాబాద్ కు వెళ్లారని కూడా చెప్పిన క‌సూరి ఈమధ్యనే దిలీప్ పాక్‌కు వచ్చి వెళ్లారని చెప్పారు. పాక్ వేర్పాటువాది అయిన మ‌హ్మద్ అలీ జిన్నా భారతదేశంలో ఉన్న చివరిరోజుల్లో ముంబైలో దిలీప్ కుమార్ ను కలిశారని తెలిపారు. గ‌తంలో జియా ఉల్ హక్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నపుడు పాక్‌లో ప‌ర్య‌టించార‌ని వెల్ల‌డించారు.

ప‌నిలో ప‌నిగా మ‌హాత్మాగాంధీని కూడా క‌సూరి వివాదంలోకి లాగారు. త‌మ దేశానికి భారతదేశం నుంచి రావాల్సిన బకాయిల కోసం మహాత్మాగాంధీ నిరవధిక నిరాహార దీక్ష చేశారన్న విషయం పాకిస్థాన్ లో కూడా చాలామందికి తెలియదని కసూరీ చెప్పారు. మొత్తంగా దేశంలో ప‌ర్య‌ట‌న పూర్త‌యిన త‌ర్వాత త‌నదైన శైలిలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసి పాకిస్తాన్ బుర్ర‌లు ఎలా ప‌నిచేస్తాయో చెప్ప‌క‌నే చెప్పారు.