Begin typing your search above and press return to search.
జీహెచ్ఎంసీ: తొందరపడి ముందే కూసిన ‘ఖుష్బూ
By: Tupaki Desk | 4 Dec 2020 12:27 PM GMTతొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్టుగా మారింది ఖుష్బూ పరిస్థితి.. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ ట్వీట్ చేశారు. బీజేపీపై అతి ఉత్సాహంతో ముందుగానే గెలిచేశామని ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ట్వీట్ చేసిన ఖుష్బూ ‘ఈ ఫలితాలు ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో స్పష్టం చేస్తున్నాయని.. తాము ఇంతకంటే ఏమీ చెప్పలేమని.. బీజేపీ పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని’ అన్నారు. హైదరాబాదీలకు థ్యాంక్స్ చెప్పారు.
అయితే జీహెచ్ఎంసీలో బీజేపీ విజయం సాధించకముందే ఖుష్బూ చేసిన ట్వీట్ బూమరాంగ్ అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ చూసి ట్వీట్ చేసిన ఖుష్బూకు తర్వాత వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ ముందంజలో నిలవడంతో షాక్ తగిలింది. ఓట్ల లెక్కింపులో మొదట్లో ఖుష్బూ ట్వీట్ చేయగా.. ఇప్పుడు టీఆర్ఎస్ లీడ్ లో ఉండడంతో ఆమెను నెటిజన్లు ఎండగడుతున్నారు.
ఖుష్బూ ట్వీట్ చేసినా సొంతంగా బీజేపీ గ్రేటర్ పీఠాన్ని అధిరోహించే అన్ని సీట్లు సాధించడం కష్టంగానే మారింది. ప్రస్తుతం బీజేపీ 44 స్థానాలను గెలవగా.. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే టీఆర్ఎస్-ఎంఐఎం కలిస్తే మాత్రం గ్రేటర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది.