Begin typing your search above and press return to search.
సెట్స్ పైకి ఖుష్బూ పార్టీ కార్యాలయం.. ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసా?
By: Tupaki Desk | 4 March 2021 12:30 AM GMTరాజకీయాలకు సినీ ఇండస్ట్రీ షార్ట్ కట్ అన్న నానుడిని ఇప్పటికే చాలా మంది నిజం చేసి చూపించారు. సినిమాల్లో తెచ్చుకున్న పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి, పాలిటిక్స్ లో గెలుపు జెండా ఎగరేసినవాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో తాను కూడా చేరాలని ఉవ్విళ్లూరుతోంది నటి ఖుష్బూ.
ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాట పోటీచేసి, ఎమ్మెల్యేగా గెలవాలని కలలు కంటున్నారు. చేపాక్కం ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఆమె సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గంలోనే ఉండి, ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఖుష్బూ. ఈ ఎన్నికల వరకు అక్కడ ఓ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. అది తాత్కాలిక కార్యాలయం కావడంతో.. సినిమా సెట్స్ మాదిరిగా, పార్టీ కార్యాలయాన్ని కూడా సెట్టింగ్ తో సెట్ చేసుకున్నారు ఖుష్బూ.
ఓ నాలుగు కంటైనర్లను పక్కపక్కన పెట్టేసి, వాటిపైన పార్టీ కార్యాలయం సెట్టింగ్ వేశారు. ఇందులో ఒక కంటైనర్ ఖుష్బూ వ్యక్తిగత కార్యాలయం కాగా.. మిగిలిన మూడు నాయకులు, కార్యకర్తల కోసం సిద్ధం చేశారు. అయితే.. ఇదేదో ఆషామాషీగా కాదు.. అందులో ఏసీ బిగించారు. కంప్యూటర్లు, ప్రింటర్, ఇతరత్రా ఫర్నిచర్ మొత్తం ఏర్పాటు చేశారు. మొత్తానికి రాజకీయాల్లోనూ తనదైన సినిమా చూపించడానికి ఖుష్బూ బాగానే కసరత్తు చేస్తున్నారు. మరి, ఓటర్లు ఎంత మేరకు ఆకర్షితులవుతారో చూడాలి.