Begin typing your search above and press return to search.
ఖుష్బూ స్థానం ఫిక్స్..
By: Tupaki Desk | 14 March 2021 8:50 AM GMTకొంతకాలం క్రితం ప్రముఖ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమిళనాట ఆమె హాడావుడి పెరిగిపోయింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ తో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. కొంతకాలం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన ఖుష్బూ ఆ తర్వాత బీజేపీని బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు. ఇందుకోసం అనేక వినూత్న కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ ఏ స్థానం నుంచి పోటీచేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొన్నది. ఆమె చేపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తొలుత భావించారు. ఈ నియోజకవర్గం .. దివంగత డీఎంకే అధినేత కరుణానిధిది. ఇక్కడ ఆయన మనవడు ప్రముఖ సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ పోటీచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఖుష్బూ పోటీచేస్తే.. ఉదయనిధి వర్సెస్ ఖుష్బూ మధ్య రసవత్తరమైన పోటీ ఉంటుందని అంతా భావించారు. పోటీకి ఖుష్బూ కూడా సిద్ధపడ్డారు. కానీ ఆఖరి నిమిషంలో ఖుష్బూ ఆశలపై అన్నాడీఎంకే నీళ్లు చల్లింది. పొత్తులో భాగంగా ఈ నియోజవర్గం నుంచి మరో భాగస్వామ్య పక్షం పీఎంకే పోటీచేస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రకటించింది. దీంతో ఖుష్బూ అలకబూనారు. అయితే ప్రస్తుతం ఆమెను చెన్నై మహానగరంలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని బీజేపీ యోచిస్తున్నదట. అయితే అందుకు ఖుష్బూ ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.
ఆమె చాలా రోజులుగా చేపాక్ నియోజకవర్గంలో పోటీచేయాలని భావించారు. అక్కడ ప్రచారం కూడా చేసుకున్నారు. అక్కడ కొంతమంది నేతలను కలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి మద్దతు కూడగట్టుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ నియోజకవర్గం చే జారడంతో ఆమె నిరాశకు గురయ్యారు. అయితే ఖుష్బూ అలకబూనడంతో ఆమెకు మరో నియోజకవర్గంలో అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. ఇందులో భాగంగానే ఆమెను థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నది. మరి అక్కడి నుంచి ఆమె గట్టెక్కుతుందో లేదో చూడాలి.