Begin typing your search above and press return to search.
అలనాటి గ్లామర్ తారకు డాక్టరేట్!
By: Tupaki Desk | 7 March 2020 4:23 AM GMTసౌత్ లో 90లలో గ్లామర్ కు నిర్వచనం ఇచ్చిన వారిలో ఒకరు ఖుష్బూ. ప్రత్యేకించి తమిళనాడు ఖుష్బూ గ్లామర్ కు ఫిదా అయిపోయింది. ఆమెను దేవతగా ఆరాధించింది. తమిళనాట స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ ను సంపాదించుకుంది ఖుష్బూ. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి.. పక్కా తమిళ్ అనిపించేంత స్థాయి లో ఆమె అక్కడ సెటిలైంది. తనను బాగా ఆదరించిన తమిళ ప్రేక్షకులపై కృతజ్ఞత గా తమిళాన్ని నేర్చుకుంది. తమిళనాడులోనే సెటిలైంది.
తమిళుడునే పెళ్లి చేసుకుంది. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట డీఎంకే, ఆ తర్వాత కాంగ్రెస్ నేతగా సాగుతూ ఉంది. ఇలాంటి నేఫథ్యంలో తమిళనాడుకు ఆమె సేవలను పరిగణనలోకి తీసుకుని.. అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఆ అవార్డును స్వీకరించి, ఆనందాన్ని పంచుకుంది ఖుష్బూ.
ఇది వరకూ చాలా మంది వెటరన్ నటులకు విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు దక్కాయి. పలువురు తెలుగు హీరోలు కూడా వాటిని అందుకున్నారు. అయితే హీరోయిన్లు ఈ విషయంలో వెనుకబడ్డారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలో హీరోయిన్లుగా నటించిన వారు అలాంటి అవార్డులను అందుకున్నారు కానీ, ఆ తర్వాతి వారు మాత్రం ఆ విషయంలో వెనుకబడ్డారు. అయితే అలాంటి లోటును భర్తీ చేస్తూ.. సినిమాలతో పాటు సామాజిక అంశాల మీద కూడా స్పందించే ఖుష్బూ కు డాక్టరేట్ దక్కినట్టుగా ఉంది.