Begin typing your search above and press return to search.

కుష్బూ బీజేపీలోకి చేరడానికి అసలు కారణం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   22 Oct 2020 2:30 AM GMT
కుష్బూ బీజేపీలోకి చేరడానికి అసలు కారణం ఏమిటంటే ?
X
కుష్బూ సుందర్ ..గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె , తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ లో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుష్బూ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు వివాదాస్పదం అవ్వడంతో , ఆమె పై ఏకంగా 30కి పైగా కేసులు కూడా పెట్టారు. దీనితో జరిగిన విషయాన్ని తెలుసుకొని , చివరకు ఆమె క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, అసలు కాంగ్రెస్ పార్టీని ఆమె ఎందుకు విడవాల్సి వచ్చింది ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కుష్బూ.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని చెప్తూ .. బీజేపీలో చేరడంపై సమర్థించుకున్న ఆమె, ఫిబ్రవరిలోనే సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపామని, అయితే వ్యక్తిగతంగా మాత్రం కలవలేకపోయానని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌లో కొందరు తనను అణచివేశారని మండిపడ్డారు , అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి ఇష్ట పడలేదు.కాంగ్రెస్ పార్టీలో తనను ఒక్కరు కాదు చాలా మంది అణచివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు కుష్బూ, రాష్ట్ర నేతల నుంచి జాతీయ నేతల వరకూ దాంట్లో ఉన్నారని పేర్కొన్నారు.. అయితే, దురదృష్టవశాత్తు... వారందరూ ఢిల్లీలో ఓ కొటరీలాగా తయారయ్యారు.

ముఖ్యంగా రాహుల్ ఆయన చుట్టూ ఆ కోటరీని ఏర్పర్చుకున్నారు. కొత్తగా వచ్చే వారిని అందులోకి అనుమతించరు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అలాగే గత కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరాలంటూ ఆఫర్లు వచ్చాయని , అయితే అప్పుడు కుదరదని చెబుతూ వచ్చానని, చివరికి పునరాలోచన చేసి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ కి పూర్తిగా గుడ్ బై చెప్పి , బీజేపీలో చేరాను అని చెప్పారు.