Begin typing your search above and press return to search.

భీమ్లానాయక్ కోసం సెలవు ప్రకటించిన కంపెనీ

By:  Tupaki Desk   |   25 Feb 2022 10:00 PM IST
భీమ్లానాయక్ కోసం సెలవు ప్రకటించిన కంపెనీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా పతాక స్థాయికి చేరుకుంది. వకీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇప్పుడది రావడంతో ఆ సినిమా కోసం ఎగబడ్డారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 'భీమ్లానాయక్' విడుదలైంది. పవన్ తోపాటు రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. తమన్ సంగీతం అందించారు.

మలయాళం సూపర్ హిట్ అయ్యప్పమ్ కోషియమ్ సినిమాకు రిమేక్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భీమ్లానాయక్ ప్రభావం ఉద్యోగులపై కూడా పడింది. అనంతపురంలోని దక్షిణ కొరియాకు సంబంధించిన ప్రముఖ కార్ల కంపెనీ కియా కూడా సెలవు ప్రకటించింది.

కియా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు భీమ్లానాయక్ చూసేందుకు మూకుమ్ముడిగా సెలవు పెట్టారు. సినిమా చూసేందుకు సెలవు కావాలని యాజమాన్యానికి లేఖ రాశారు. ఉద్యోగుల లేఖతో షాకైన కంపెనీ హెచ్.ఆర్ విభాగం వెంటనే ఈరోజు సెలవు ప్రకటించింది. శుక్రవారానికి బదులు ఆదివారం విధుల్లోకి రావాలని ఉద్యోగులను యాజమాన్యం ఆదేశించింది.

భీమ్లా నాయక్ మూవీ ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. తెలంగాణలో పరిమితులు ఏం లేవు. కానీ ఏపీలో జీవో  35ను అమలు చేయడంతో టికెట్ రేట్లు, కలెక్షన్లపై ప్రభావం పడింది.కానీ భారీగా స్పందన ఉండడంతో కలెక్షన్లు భారీగా వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.