Begin typing your search above and press return to search.
విశాఖలో కియా భారీ పెట్టుబడులు...?
By: Tupaki Desk | 12 Dec 2022 1:30 AM GMTరాయలసీమ జిల్లా అనంతపురంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమ తొలి ఉత్పత్తిని వైసీపీ ప్రభుత్వం ఉండగానే జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే కియా మోటార్స్ తన నెక్స్ట్ స్టెప్ గా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలైన ప్రాంతంగా విశాఖను ఎంచుకుంటోంది అన్న వార్తలు ఇపుడు చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి ఒక దశలో కియా పరిశ్రమ ఏపీ నుంచి తరలివెళ్ళిపోతుందని, తమిళనాడులో పెడతారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ కియా సంస్థ యాజమాన్యం వాటిని ఖండించడమే కాకుడా తాము ఏపీలోనే ఉంటామని స్పష్టం చేసింది. అంతే కాదు ప్రస్తుత ప్రభుత్వంతో తమకు సౌకర్యవంతంగానే ఉంది అని పేర్కొంటూ వచ్చింది. మొత్తానికి కియా పరిశ్రమ అన్నది ఏపీలో ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయం.
అయితే ఆ సస్థ తన వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా విశాఖ వంటి నంబర్ వన్ సిటీని ఎంచుకుంటోంది అని చెబుతున్నారు. విశాఖ రాజధాని నగరం అని అంటున్నారు. దీంతో కొత్త గ్లామర్ చాలానే వచ్చింది. ఒకవేళ రాజధాని కాకపోయినా విశాఖకు వచ్చిన లోటేమీ లేదు. ఇప్పటికే ఏపీలోనే కాకుండా సౌతిండియాలో పారిశ్రామిక నగరంగా ప్రాధాన్యత దక్కించుకుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అనేకం విశాఖలో ఉన్నాయి. ఇపుడు వాటి జాబితాలోకి కియా కూడా వచ్చి చేరుతుంది అని అంటున్నారు. ఈ మధ్య కియా సంస్థ యాజమాన్య ప్రతినిధులు విశాఖ వచ్చి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారితో మంత్రి మాట్లాడుతూ విశాఖలో కూడా కియా మోటార్స్ కార్యకలపాలు విస్తరించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి.
అంతే కాదు వచ్చే ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని కోఅరు. విశాఖతో పాటు ఏపీలో ఇతర చోట్ల కూడా కియా తన వ్యాపారాన్ని విస్తరిస్తామని భావిస్తే పూర్తి సహకారం అందిస్తామని కూడా మంత్రి హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే కియా యాజమాన్యం కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో తమకు సహకారం లభిస్తోందని చెబుతున్నారు.
దాంతో విశాఖలో కియా తన బిజినెస్ యాక్టివిటీని పూర్తి స్థాయిలో విస్తరిస్తోందని అంటున్నారు. దానికి సంబంధించి అవసరమైన భూమి ఇతర అంశాలలో సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అంటున్నారు. ఈ మేరకు మంత్రి గుడిగాడతో చర్చిచిన కియా సంస్థ ప్రతినిధులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు అని అంటున్నారు. కియా వంటి సంస్థ విశాఖకు వస్తే కనుక ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. అదే విధంగా ఇన్వెసెట్మెంట్స్ కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ కూడా విశాఖలో జరుగుతోంది.
దాంతో తరలివచ్చే దేశ విదేశీ పెట్టుబడుదారులను కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తామని అంటున్నారు. మొత్తానికి చూస్తే విశాఖకు తొందరలో మరిన్ని కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.