Begin typing your search above and press return to search.
కియా తరలింపు..కంపెనీ కీలక ప్రకటన
By: Tupaki Desk | 7 Feb 2020 3:17 PM GMTదక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సంస్థ ప్లాంట్ ను తమిళనాడుకు తరలించనున్నట్టు పుకార్లు రావడం - ఏపీలో ప్రకంపనలు సృష్టించడం తెలిసిన సంగతే. అయితే, వదంతులపై కియా ఎండీ కీలక ప్రకటన చేశారు. కియా పరిశ్రమను తమిళనాడుకు తరలిస్తారన్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు సంస్థ పీఆర్ ఓ వివరాలు వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో దాదాపు 110 కోట్ల డాలర్లతో ఏర్పాటుచేసిన ప్లాంట్ ను పొరుగు రాష్ట్రానికి తరలించేందుకు కియా కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నదని - గత ఏడాది నుంచి విధానపరంగా ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు కారణమని ఈ చర్చలతో సంబంధమున్న వర్గాలు స్పష్టం చేశాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనిపై సంస్థ పీఆర్ఓ మీడియాతో మాట్లాడుతూ - అనంతపురం నుంచి యూనిట్ ను ఎక్కడికి తరలించడం లేదని తెలిపారు. భారతదేశ మార్కెట్ పై లక్ష్యంతో అనంతపురంలో తమ యూనిట్ ను ఏర్పాటు చేశామని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని - ఈ యూనిట్ నుంచే కొత్త మోడళ్ళను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశారు.అనంతపురం నుంచి తమ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లడంలేదని, పరిశ్రమ అక్కడే కొనసాగించడంపై తాము అంకితభావంతో ఉన్నామని ఆమె చెప్పారు. అనంతపురం పరిశ్రమ నుంచి ప్రపంచస్థాయి వాహనాలు తయారుచేస్తామని తెలిపారు.
అనంతపురం జిల్లాలోని ప్లాంట్ లో కియా గతేడాది ద్వితీయార్థం నుంచి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచంలోని అతిపెద్ద కార్ల మార్కెట్ లో ఐదవదిగా ఉన్న భారత్ లో కియా ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్ ఇదే. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 12 వేల ఉద్యోగాలు సృష్టించింది. అయితే ఈ ప్లాంట్‌ను అనేకమంది ఆటోమొబైల్ విడిభాగాల సరఫరాదారులకు నెలవుగా ఉన్న తమిళనాడుకు తరలించేందుకు కియా యాజమాన్యం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపతున్నట్టు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారితో పాటు - ఈ చర్చలతో సంబంధమున్న మరో అధికారి ధ్రువీకరించినట్టు రాయిటర్స్ పేర్కొనగా...దాన్ని సంస్థ ఖండించింది.