Begin typing your search above and press return to search.
కియా కలకలం: ఉలిక్కిపడిన ఏపీ
By: Tupaki Desk | 6 Feb 2020 5:49 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసేందేమిటంటే అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్లాంటు ఏర్పాటు ఒక్కటే చెప్పుకోదగ్గది. అయితే అలాంటి సంస్థను తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్క్ సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో కూడా దీన్ని మహారాష్ట్రకు తరలించేస్తున్నారని పలు ప్రచారం సాగింది కూడా. అయితే ఈ వార్త అవాస్తవమని కియా మోటర్స్ ప్రకటించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ వార్తను ఖండించింది. ఈ వార్తతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కరువు ప్రాంతంగా ఉన్న అనంతపురము జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్ సంస్థ తన ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. సంస్థ ఏర్పాటు గతేడాది ఓ కొలిక్కి వచ్చింది. రూ.7,387 కోట్ల విలువైన ప్లాంట్ ను రెండేళ్ల పాటు నిర్మించారు. 2019 డిసెంబర్‌లో కియా మోటార్స్ నుంచి కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్ లో ఏటా 3 లక్షల కార్లను తయారు చేసే సత్తా ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 12,000 మందికి ప్రత్యక్షంగా - పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. ఇలాంటి సంస్థ తమిళనాడుకు తరలిపోతుందని రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. దానికి గల కారణాలను కూడా వెల్లడించింది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. తమిళనాడులో జోరుగా ఆటో మోబైల్ రంగం జోరుగా సాగుతోంది. వాహనాల విడిభాగాలు అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ కూడా అక్కడికి తరలిపోయే ఆలోచన చేస్తోందని రాయిటర్స్ పేర్కొంది. ఏపీలో ప్రభుత్వం మారడంతో సంస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మరో కారణం తెలిపింది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు చేసిందని - వచ్చే వారం సెక్రెటరీ స్థాయిలో చర్చలు జరగనున్నాయని కూడా పేర్కొంది. ఆ తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందని ఓ ప్రభుత్వాధికారి తమకు చెప్పినట్లుగా రాయిటర్స్ సంస్థ తన కథనంలో వివరించింది.
ఈ ప్రచారంలో నిజం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. తమ ప్లాంటులో 85 శాతం స్థానిక యువతే పనిచేస్తున్నారని - పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతోందనీ సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో రాయిటర్స్ సంస్థ కథనం తప్పు అని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండన: రాయిటర్స్ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. అసత్యాలతో కూడిన కథనం అని తెలిపింది. కియా - ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పరిశ్రమలు - వాణిజ్యం - పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ తెలిపారు.
అయితే అకస్మాత్తుగా ఈ కథనం ప్రచురించడం వెనక ఏవో కోణాలు దాగి ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరిట పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్థిక విధానాలు - గత ఒప్పందాలు రద్దు చేస్తున్నారనే ఉద్దేశంతో పలు సంస్థలు తరలిపోతున్నాయనే ప్రచారం సృష్టిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా కియా మోటర్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాలతో విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం చేయడానికి ఈ కథనం వేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఎందుకంటే గతంలో కియా మోటర్స్ సంస్థను అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ పార్టీ వ్యతిరేకించింది. అప్పటి నిర్ణయంతో ఇప్పుడు కియాకు సహకరించకుండా చేస్తోందని అందులో భాగంగానే కియా మోటర్స్ తమిళనాడుకు తరలివెళ్లాలనే ఆలోచన చేసిందని పుకార్లు సృష్టిస్తున్నారని అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు.