Begin typing your search above and press return to search.

ఈ రోజు రోడ్డెక్క‌నున్న‌ తొలి 'తెలుగు' కారు!

By:  Tupaki Desk   |   29 Jan 2019 5:07 AM GMT
ఈ రోజు రోడ్డెక్క‌నున్న‌ తొలి తెలుగు కారు!
X
తెలుగు నేల మీద ఒక కారు త‌యారు కావటం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగింది లేదు.తెలుగురాష్ట్రాలు అంత గొప్ప‌వి.. ఇంత గొప్ప‌వి అని చెప్పినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌టంటే ఒక్క కార్ల ప‌రిశ్ర‌మ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. తెలుగునేల మీద ప్ర‌ఖ్యాత కియో మోటార్స్ త‌యారు చేసిన తొలికారును ఈ రోజు రిలీజ్ కానుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావ‌త్ దేశంలోనూ క‌రువు నేల అన్నంత‌నే గుర్తుకు వ‌చ్చే అతి కొద్ది జిల్లాల్లో ఒక‌టైన అనంత‌పురం జిల్లాలో ఏర్పాటైన కియో కార్ల ప‌రిశ్ర‌మ‌.. తాను త‌యారు చేసిన కారును ఈ రోజున విడుద‌ల చేయ‌నున్నారు.

కియో కారు విడుద‌ల‌తో అనంత‌పురం జిల్లా కార్ల ప‌రిశ్ర‌మ జిల్లాగా కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకోనుంది. ద‌క్షిణ కొరియాకు చెందిన కియో మోటార్స్ ప‌రిశ్ర‌మ గ‌డిచిన కొంత‌కాలంగా కార్ల త‌యారీపై దృష్టి పెట్టింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కియో ప్లాంట్ ను పెట్టాల‌ని ప‌రిశీలించారు. ఇందులో భాగంగా క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. మ‌హారాష్ట్ర.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ రాష్ట్రాల్ని ప‌రిశీలించినా.. ఏపీ స‌ర్కారు కార‌ణంగా అనంత‌పురంలో త‌మ ఫ్లాంట్ ను పెట్టేందుకు మొగ్గు చూపింది. అలా మొద‌లైన కార్ల త‌యారీ ఈ రోజు విడుద‌ల వ‌ర‌కూ వ‌చ్చింది.