Begin typing your search above and press return to search.
కియా మోటార్స్‌లో కలకలం: ఓ ఉద్యోగికి పాజిటివ్
By: Tupaki Desk | 5 Jun 2020 1:30 AM GMTమహమ్మారి వైరస్ కొత్త కొత్త ప్రాంతాల్లో విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. తాజాగా అనంతపురములోని కియా మోటార్స్‌కు కూడా ఈ వైరస్ పాకింది. సంస్థలోని ఓ ఉద్యోగికి పాజిటివ్ తేలింది. దీంతో ఉద్యోగులందరూ భయాందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసింది.
తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి కియా పరిశ్రమలోని బాడీషాప్‌లో పని చేస్తున్నాడు. మే 25వ తేదీన పరిశ్రమలో తిరిగి విధుల్లోకి చేరాడు. పని చేస్తున్న క్రమంలోనే అతడికి వైరస్ సోకిందని తేలింది. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం అతడిని అనంతపురములోని ఎస్కేయూ క్వారంటైన్‌కు తరలించారు. అతడితోపాటు విధుల్లో ఉన్న మరికొందరిని గుర్తించి వారికి పరీక్షలు చేస్తున్నారు. అతడికి కాంటాక్ట్‌లో ఉన్న ఉద్యోగుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
వైరస్ పాకడంతో పరిశ్రమలో ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం విధుల్లోకి తీసుకోవాలని కియా పరిశ్రమ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీలన్నీ ప్రారంభమవడంతో అందులో భాగంగా కియా పరిశ్రమ కూడా పునః ప్రారంభమైంది. విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ వంటివి అందుబాటులో ఉంచుతున్నారు. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.