Begin typing your search above and press return to search.
చిన్నారిని ‘మింగిన’ విదేశీ చాక్లెట్!
By: Tupaki Desk | 27 Nov 2022 1:30 PM GMTతాను విదేశాల నుంచి తెచ్చిన చాక్లెటే తన కుమారుడి ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు.. ఆ తండ్రి. తన కుమారుడికి విదేశీ చాక్లెట్‌లను బహుమతిగా ఇద్దామని తెస్తే అవే ఆ బాలుడి ప్రాణాలు తీశాయి. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఆ బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది.
ఈ విషాద ఘటన వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని వరంగల్ నగరంలో రాజస్థాన్‌కు చెందిన కంగర్ సింగ్ గత కొన్నేళ్లుగా ఉంటున్నాడు. వరంగల్ డాల్ఫిన్ గల్లీలో ఆయన నివాసముంటున్నాడు. జీవనోపాధి కోసం వరంగల్‌లోనే ఆయన ఎలక్ట్రికల్ షాపు ఒకటి నిర్వహిస్తున్నాడు.
కంగర్ సింగ్‌కు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వరంగల్లోని స్థానిక శారద పబ్లిక్ స్కూల్‌లో చిన్నారులు చదువుతున్నారు.
కాగా ఇటీవల కంగర్ సింగ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. ఈ క్రమంలో పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో తాను విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను కంగర్ సింగ్ భార్య పిల్లలకు ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను తినడానికి నోట్లో వేసుకున్నాడు. అయితే అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు.
గమనించిన పాఠశాల సిబ్బంది సందీప్ తండ్రి కంగర్ సింగ్‌కి సమాచారం అందించారు. హుటాహుటిన చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోవడాన్ని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్ కన్నుమూశాడు. దీంతో బాలుడి మృతితో కంగర్ సింగ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పలువురు సానుభూతి వ్యక్తం చేశారు.