Begin typing your search above and press return to search.

శ్రీ‌కాంత్‌ కు చంద్ర‌బాబు భారీ న‌జ‌రానా!

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:28 PM GMT
శ్రీ‌కాంత్‌ కు చంద్ర‌బాబు భారీ న‌జ‌రానా!
X
రాష్ట్ర ఆర్థిక‌ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఖ‌ర్చుల విష‌యంలో ఏ మాత్రం ప‌ట్ట‌న‌ట్లుగా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఖ‌ర్చు చేయ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఎక్కువ‌న్న మాట ప‌లువురు నోట వినిపిస్తుంటుంది. ఆర్భాటం కోసం ఆయ‌న చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు. రిచ్‌గా.. గ్రాండ్ నెస్ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని ఆయ‌న నైజం ప‌లుమార్లు వేలెత్తి చూపించేలా ఉంటుంది.

ఖ‌ర్చులో ఖ‌ర్చు అనుకున్నారో.. క్రీడ‌ల్ని ప్రోత్స‌హించ‌టానికి భారీ న‌జ‌రానా ఇచ్చినా త‌ప్పు లేద‌నుకున్నారేమో కానీ.. భార‌త బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు.. తెలుగు క్రీడాకారుడు శ్రీ‌కాంత్‌కు ఏపీ స‌ర్కారు భారీ న‌జ‌రానాను ప్ర‌క‌టించింది. ఫ్రెంచ్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ కైవ‌శం చేసుకున్న అత‌గాడికి రూ.2కోట్ల న‌గ‌దుతో పాటు వెయ్యి గ‌జాల స్థ‌లం.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఉద్యోఒగాన్ని ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఒలింపిక్స్ లో అద్భుత ఆట‌ను ప్ర‌ద‌ర్శించిన మ‌రో బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సింధుకు సైతం గ్రూప్ 1 ఉద్యోగాన్ని.. భారీ న‌జ‌రానాను ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. శ్రీ‌కాంత్‌తో పాటు ఆయ‌న కోచ్ గోపీచంద్కు.. మ‌రో ఇద్ద‌రు కోచ్‌ల‌కు రూ.30ల‌క్ష‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీ‌కాంత్‌కు ఇవ్వాల్సిన భారీ న‌జ‌రానాపై ఏపీ క్యాబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. ఇదిలా ఉండ‌గా.. ఏపీ కేబినెట్ స‌మావేశం సుదీర్ఘంగా సాగుతోంది.

బుధ‌వారం ప్రారంభ‌మైన మంత్రివ‌ర్గ స‌మావేశంలో దాదాపు 35 అంశాల మీద చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. స్వ‌చ్ఛంద కార్పొరేష‌న్ రూ.500 కోట్ల రుణం పొందేందుకు వీలుగా నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌ర్సిటీల్లో బోధ‌న‌.. బోధ‌నేత‌ర సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించి ఎపీపీఎస్సీకి బాధ్య‌త అప్ప‌గించాల‌న్న నిర్ణ‌యంతో పాటు ప‌లు అంశాలపై నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయ‌నున్న పాద‌యాత్ర అంశంపైనా మంత్రివ‌ర్గంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.