Begin typing your search above and press return to search.
కృష్ణా జిల్లాను వణికిస్తున్న వాట్సాప్ సందేశాలు
By: Tupaki Desk | 21 May 2018 7:47 AM GMTచిన్నపిల్ల్ని అపహరించి.. వారిని దారుణంగా హత్య చేయటం.. మరిన్ని ఛండాలు చేస్తున్నట్లుగా ఇటీవల వాట్సాప్ లో వస్తున్న సందేశం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఎక్కువ అయినట్లుగా తెలుస్తోంది.
చిన్నారుల మెదళ్లను తినేసే అత్యంత దారుణమైన.. కరకు దొంగలు కొందరు ఇళ్లను టార్గెట్ చేయటం.. సొత్తును చోరీ చేసి.. మనుషులపై దాడికి పాల్పడుతున్నారని.. ప్రాణాలు తీస్తున్నట్లుగా వాట్సాప్ లలో చిట్టి పొట్టి మెసేజ్ లు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా కృష్ణా జిల్లాలో అలాంటి పరిస్థితే నెలకొంది. చిన్నారుల్ని కిడ్నాప్ చేసి చంపేస్తున్న వైనం ఎక్కువ అయ్యిందని.. వారి నుంచి తమ వాళ్లను కాపాడుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల ప్రజలు భయాందోళనలతో నిద్ర పోని పరిస్థితి. రాత్రివేళలో ఎప్పుడు ఎవరొచ్చి దాడికి దిగుతారోనన్న ఆలోచనతో గ్రామాల్లోని యువకులు కర్రలు పట్టుకొని పహరా కాస్తున్నారు.
వాట్సాప్ వదంతులతో భయపడుతున్న పలు గ్రామాల వారు.. తమ గ్రామాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ.. పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇక.. మిత్రులు.. బంధువులు అదే పనిగా ఫోన్లు చేసి.. మీరు.. మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటూ ఫోన్లు చేస్తున్న వైనం మరింత మనో వ్యధకు గురి చేస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం కృష్ణా జిల్లా వాసుల్ని వణికిస్తోంది. అయితే.. వాట్సాప్ గ్రూపుల్లో సాగుతున్న ప్రచారంలో నిజం లేదని.. భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. ఎవరి నమ్మని పరిస్థితి నెలకొంది.