Begin typing your search above and press return to search.
ఆ కుర్రాడి కిడ్నాప్ కు ఆ సినిమానే స్పూర్తినట
By: Tupaki Desk | 19 Nov 2019 5:42 AM GMTసంచలనంగా మారిన కిడ్నాప్ ఉదంతానికి స్ఫూర్తి సినిమానే అన్న షాకింగ్ నిజాన్ని వెల్లడించాడా కుర్రాడు. ఏడేళ్ల పిల్లాడ్ని పదిహేడేళ్ల కుర్రాడు కిడ్నాప్ చేయటం నోట మాట రాకుండా చేసింది. కిడ్నాప్ ప్లాన్ చేసిన కుర్రాడ్ని పోలీసులు విచారించగా.. మరో కొత్త విషయం బయట పడింది. తాను చేసిన కిడ్నాప్ కు ఆ మధ్యన విడుదలైన గగనం సినిమానే స్ఫూర్తి అన్న విషయాన్ని ఆ కుర్రాడు వెల్లడించాడు.
ఫోన్లో గొంతు మార్చే టెక్నాలజీని వాడటం ద్వారా కిడ్నాపర్ అవతారమెత్తిన కుర్రాడిని రాచకొండ పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే పట్టుకోవటంపై హర్షం వ్యక్తమవుతున్నా.. చిన్న వయసులోనే ఇలాంటి దారుణ నేరాలు చేసేందుకు తెగించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఇదే కుర్రాడు గతంలో ఒక ఇంట్లో రూ.లక్ష దొంగతనం చేసిన వైనం పోలీసు విచారణలో బయపడింది. గగనం సినిమాలో ఉగ్రవాదుల్ని స్ఫూర్తిగా తీసుకొని కిడ్నాప్ చేసిన ఆ కుర్రాడిపై గతంలో అతడి నేర చరిత్ర ఆధారంగా అడల్ట్ డిఫెండర్స్ కు పడే శిక్ష విధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ పోలీసులు భావిస్తున్నారు. ఏమైనా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. మానవ సంబంధాలకు పాతర వేసేలా చోటు చేసుకుంటున్న పరిణామాలే వేదనను మిగులుస్తున్నాయనటంలో సందేహం లేదు.