Begin typing your search above and press return to search.
ఛానల్ ఎండీ కిడ్నాప్ జస్ట్ మిస్..?
By: Tupaki Desk | 16 Sep 2015 6:19 AM GMTఈ మధ్యన ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్నారిని కిడ్నాప్ చేసిన ఉదంతం కలకలం రేపటం.. దాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసును చేధించటం జరిగిపోయాయి. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు చెప్పుకొచ్చారు.
నిజానికి కిడ్నాపర్ల ప్లాన్ చిన్న పిల్లాడు కాదని.. ఓ ఛానల్ ఎండీ స్థాయి వ్యక్తిగా తేల్చారు. నిత్యం టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ చేసే టీవీ ఛానల్ కు.. ఎండీనే వార్తాంశంగా మారేవారు. అత్యంత చాకచక్యంతో ఛానల్ ఎండీ స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేయాలని తొలుత భావించారు. అయితే.. అది వర్క్ వుట్ కాకపోవటంతో చిన్నపిల్లాడిని కిడ్నాప్ చేశారు.
అయితే.. ఘటనాస్థలంలో కిడ్నాపర్లు మొబైల్ ఫోన్ మర్చిపోవటం పోలీసులకు లాభించింది. సదరు సెల్ ఫోన్ సాయంతో కిడ్నాపర్ల గుట్టు రట్టు చేశారు. తాజా ఉదంతంతో హైదరాబాద్ లోని అత్యంత కీలకమైన వ్యక్తుల భద్రత విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అయితే.. ఈ కిడ్నాపర్లు డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్నారు. సో.. వీవీఐపీలు పారాహుషార్.