Begin typing your search above and press return to search.
భూమా బ్రహ్మానందరెడ్డి పైనా కిడ్నాప్ కేసు..
By: Tupaki Desk | 27 Jan 2021 11:30 AM GMTకర్నూలు జిల్లాలో.. అందునా నంద్యాల ఎంపీ నియోజకవర్గ పరిధిలో బలమైన రాజకీయ కుటుంబం అన్నంతనే గుర్తుకు వచ్చేది భూమా ఫ్యామిలీ. పవర్లో ఉన్నా లేకున్నా ఒక వెలుగు వెలిగే విలక్షణత భూమా ఫ్యామిలీ సొంతం. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంత కాలం ఆయనకు తిరుగు ఉండేది కాదు. ఎవరిని ఎక్కడి వరకు తీసుకోవాలో నాగిరెడ్డికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. దేనికైనా సై అన్నట్లుగా ఆయన తీరు ఉండేది.
అలాంటి బలమైన నాగిరెడ్డి కాలం చేయటం.. ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమార్తె చేపట్టారు. నాగిరెడ్డి మాదిరి కాకున్నా.. అందులో సగం కూడా లేకపోవటం.. భూమా ఫ్యామిలీలో ఎవరూ కూడా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవటంలో విఫలమయ్యారని చెబుతారు. ఇదిలా ఉంటే ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ ఫెయిల్ అయ్యింది.
ఈ మధ్యనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల్ని కిడ్నాప్ చేసిన ఉదంతంలో అరెస్టు అయి.. బెయిల్ మీద ఇటీవల బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా అఖిలప్రియ సోదరుడు కమ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో ముగ్గురి పైనా కేసు నమోదు చేశారు. విజయ డైయిరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్ చేశారని మల్లికార్జున్ అనే బాధితుడు కంప్లైంట్ చేశాడు. దీంతో.. భూమా ఫ్యామిలీపై మరోసారి కిడ్నాప్ మరక పడినట్లైంది.
నంద్యాల విజయ డెయిరీకి సంబంధించి మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక డైరెక్టర్ గా మల్లికార్జున్ పోటీ చేశారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 81 మంది ఓటర్లు ఉన్నారు. అనంతరం డెయిరీ ఛైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ గా పోటీ చేసిన తనను భూమా బ్రహ్మానందరెడ్డి కిడ్నాప్ చేసినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సరైన రాజకీయ వ్యూహం లేకనే.. ఇలా కిడ్నాప్ కేసుల మరకను భూమా ఫ్యామిలీ మీద వేసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.