Begin typing your search above and press return to search.
మీకు తెలుసా.. కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలివే..!
By: Tupaki Desk | 31 Jan 2022 11:30 PM GMTఇటీవల కాలంలో మనం తరుచుగా వింటున్న సమస్య కిడ్నీ. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన ఈ అవయవం ఎక్కువగా ఫెయిల్ అవుతోంది. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యం. అయితే వీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత మరో అవయవానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అవయమమే కిడ్నీ. దీనికి జబ్బు చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా మనిషి ఆరోగ్యం పైన పడుతుంది. ఎవరికైనా కిడ్నీల్లో ఇబ్బంది అంటే ఆరోగ్యంగా మాత్రమే గాక మానసికంగా కూడా కుంగుబాటుకు గురి చేస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఈ అవయవం మన దేహంలో ఉండే నీటిని ఎప్పటికప్పుడు ఒడపోస్తుంది. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంది. దీనికి తోడు మన శరీరాన్ని నిరంతరం డీటాక్సిఫై చేస్తుంది. ఇలా మనిషి ఆరోగ్యంగా ఉండడంలో కిడ్నీల పాత్ర విశేషంగా ఉంటుంది. అయితే కిడ్నీలకు వచ్చే ప్రధాన సమస్య అవి చెడిపోవడం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్. ఇలా అవి ఫెయిల్ అవడం కారణంగా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేసి డయాలసిస్ చేయించుకోవడం, పైగా చెప్పలేనంత బాధను భరించాల్సి వస్తుంది. ఇంత ఇబ్బందికి గురి చేసే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కు ఉండే లక్షణాలు ఏంటి అనేది ఓ సారి తెలుసుకుందాం. అంతేగాకుండా ఎలాంటి అలవాట్లు పాటించడం ద్వారా కిడ్నీలను కాపాడుకోగలమో కూడా తెలుసుకుందాం.
మన శరీరంలో చాలా ముఖ్యం అయిన అవయవం కిడ్నీలు. ఫెయిల్యూర్ చెందితే వాటిని ఇట్టే గుర్తు పట్టవచ్చు. ఆ లక్షణాలు ఏంటి అంటే.. కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే ఆ ప్రభావం ముందుగా చర్మంపై పడుతుంది. స్కిన్ పై బాగా దురుద రావడం ప్రారంభమవుతుంది. ఇలా జరుగుతున్న కొద్ది రోజులకే చర్మం పొడి బారడం కనిపిస్తుంది. వీటితో పాటు స్కిన్ దెబ్బతిన్నట్లు పగుళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా కొన్నిసార్లు అయితే పొక్కులు పొక్కులుగా కూడా కనిపిస్తుంది. దీనిని బట్టి మూత్రపిండాలు పనితీరు మారింది అని గుర్తించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ లో కనిపించే మరో ప్రధాన సమస్య చర్మం పొడిబారి తెల్లగా కనిపించడం. ఇది కూడా ఓ లక్షణంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో చర్మంపై చిన్నగా రుద్దినా సరే గాట్లు కనిపిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. చర్మం తో పాటే కొద్ది రోజుల్లోనే రక్తం తక్కువ అయి గోర్లు తెల్లగా మారుతాయి. ఇలా జరిగిన కొద్ది రోజుల్లోనే కాళ్లు చేతులు బాగా వాపు వస్తాయి. కడుపు నొప్పి, వెన్నునొప్పి, మూత్రంలో మంట లాంటి ఇతర సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.. ముందుగా కిడ్నీ సమస్య రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా బాడీకి క్రమం తప్పకుండా సరిపడినంత నీటిని ఇస్తుండాలి. అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. పనితీరు కూడా చక్కగా ఉంటుంది. అందుకే చాలా మంది ఇప్పుడు ప్రత్యేకంగా ఓ బాటిల్ పక్కన పెట్టుకుని నిర్ధిష్టం సమయానికి కొంచెం నీటిని తీసుకుంటుంటారు. అలానే శరీరంలో షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. చక్కెర వ్యాధి వచ్చిన వారిపై కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు బీపీని కూడా అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు అదుపులో ఉంది అంటే కిడ్నీలపై పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందుకే వాటి పనితీరు బాగుంటుంది. అంతేగాకుండా హార్ట్ కు సంబంధించిన ఇబ్బందులు వచ్చినా కానీ కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఎక్కువగా పొగ తాగే వారికి, మద్యం సేవించే వారికి వస్తాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. దీని పట్టి చూస్తే ధూమపానం, మద్యపానం సేవించడం కిడ్నీలకు హానికరం అని అర్థం అవుతుంది. కిడ్నీ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే పాటించాల్సిన మరో ముఖ్యమైంది వ్యాయామం. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల మూత్రపిండాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.