Begin typing your search above and press return to search.

అయ్య‌బాబోయ్‌: 3 వేల కోసం తండ్రిని అడ్డదిడ్డంగా న‌రికేశాడు

By:  Tupaki Desk   |   24 Nov 2022 5:30 PM GMT
అయ్య‌బాబోయ్‌: 3 వేల కోసం తండ్రిని అడ్డదిడ్డంగా న‌రికేశాడు
X
ఇటీవలే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ 35 ముక్క‌టు చేసిన‌ మాదిరిగానే ఓ యువకుడు తన తండ్రిని అడ్డ‌దిడ్డంగా న‌రికేశాడు. అనంతరం ఆ ముక్కలను అక్కడక్కడా పడేశాడు. ఈ దారుణం దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం సృష్టించింది. ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌రిగిన ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ తీవ్ర విస్మ‌యానికి గురిచేస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ప‌శ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24పరగణాలు జిల్లాలోని బరుయిపుర్ ప్రాంతంలో ఉజ్జ్వల్ చక్రవర్తి అనే మాజీ నేవీ ఉద్యోగి.. తన కుమారుడు జాయ్ చేతిలో హత్యకు గురయ్యాడు. జాయ్ ప్రస్తుతం వడ్రంగి పనికి సంబంధించి ఓ ప్రత్యేక కోర్సులో డిప్లొమా చదువుతున్నాడు. నిత్యం తండ్రీకొడుకుల మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగేది.

నవంబర్ 12న జాయ్ తన తండ్రితో రూ.3,000 కోసం గొడవ పడ్డాడు. కోపంతో తన వద్దనున్న రంపంతో తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తల్లి సహాయంతో మృతదేహాన్ని ఆరు ముక్కలుగా చేశాడు. అనంతరం ఆ భాగాలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి.. సైకిల్ మీద తీసుకువెళ్లి ఖాస్మల్లిక్, దేహిమెదన్ మల్లా అనే ప్రాంతాల్లో అక్కడక్కడా పడేశాడు.

స్థానికులు నవంబర్ 18న చెరువులో కొన్ని శరీర భాగాలను గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ శరీర భాగాలు ఉజ్జ్వల్వని గుర్తించారు. ఉజ్జ్వల్ భార్య, కుమారుడిపై అనుమానంతో పోలీసులు వారిని విచారించగా.. జాయ్నే ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేయడానికి రంపాన్ని ఉపయోగించినట్లు జాయ్ తెలిపాడు. ఈ కేసులో తల్లి, కుమారుడితో పాటు మరికొంత మందికి ఇందులో ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మొద‌టి నుంచి అంతేనా?

ఉజ్జ్వల్ కుటుంబానికి స్థానికంగా ఎవరితోనూ మంచి సంబంధాలు లేవని.. జాయ్కు అతని తండ్రి చిన్నప్పటి నుంచే కరాటేలో శిక్షణ అందించారని స్థానికులు తెలిపారు. జాయ్ మాత్రం చిన్నప్పటి నుంచే స్నేహితులతో గొడవపడి.. అల్లర చిల్లరగా తిరిగే వాడని చెప్పారు. తండ్రీకొడుకులు అప్పుడప్పుడు డబ్బులు కోసం గొడవ పడే వారు కానీ.. జాయ్నే ఈ హత్య చేశాడంటే ఆశ్చర్యంగా ఉందని కొందరు స్థానికులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.